మన నిత్య జీవితంలో అనేక ఘటనలను చూస్తుంటాము. అయితే అందులో కొన్ని అద్బుతంగా ఉంటాయి. మరి.. ముఖ్యంగా ఆధ్యాత్మికత కు సంబంధించిన కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. గుడి చుట్టు ఆవు తిరగడం. శివుడి విగ్రం చుట్టూ పాములు ఉండటం, కోతి దేవుడికి హారతి ఇవ్వడం ఇలాంటి ఘటనలు అనేకం మనం చూస్తుంటాము. కొందరు వీటిని కొట్టి పారేసిన.. మరికొందరు మాత్రం దైవ శక్తిగా భావిస్తుంటారు. ప్రతి జీవిలో దైవ భక్తి ఉందనటానికి నిదర్శనం.. ఇలాంటి ఘటనలు అని కొందరు అభిప్రాయా పడుతుంటారు. ఎవరు వాదన ఎలా ఉన్నా.. తాజాగా అలాంటి ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి చోటుచేసుకుంది. అమ్మవారి గుడిలోకి ప్రవేశించిన రెండు ఎలుగుబంట్లు.. అక్కడే ఉన్న గంటను మోగించాయి. ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లాలోని జీరిగేపల్లిలో శ్రీ అమ్మాజీ ఆలయం ఒకటి ఉంది. ఈ ఆలయంకి ఎంతో విశిష్టత ఉందని అక్కడి స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయం ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఉండటం వలన భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే ఇటీవల రెండు ఎలుగుబంట్లు ఆ గుడిలో కి ప్రవేశించాయి. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. రాత్రి తొమ్మిది గంటల సమయంలో రెండు ఎలుగు బంట్లు అమ్మవారి ఆలయంలో ప్రవేశించాయి. అందులో ఒకటి గుడి ఆవరణంలో తిరుగుతుండగా మరొకటి గంట వద్దకు వచ్చింది. అంతే కాక 108 కిలోల బరువు గల ఆ గంటను ఎలుగుబంటి మోగించింది. గంటకు వేలాడుతున్న తాడును నోటితో కరచుకుని ఉపింది. అంతే కాక ముందు కాళ్లతో లాగుతూ గుడి గంటను మోగించింది.
భక్తితో చేశాయో లేదా మరేమో కానీ ఈ దృశ్యం ఆలయ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పూజారి తాళం వేసిన వెళ్లిన అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఎలుగు బంట్లు ఆలయంలోకి ప్రవేశించాయి. అయితే ఈ ఘటనపై ఆ ఆలయ పూజారి మాట్లాడారు. ఈ ఆలయంలోకి ఎలుగుబంట్లు తరచూ వస్తుంటాయని, ఆలయంలో అమ్మవారికి సమర్పించిన ప్రసాదాన్ని, పళ్లను తిని వెళ్తుంటాయని పూజారి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.