కుటుంబం, స్నేహితులతో కలిసి సరదగా బయటకు వెళ్లాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అందుకే వీకెండ్స్ లో తమ వారితో కలిసి సందర్శనీయ స్థలాకు వెళ్తుంటారు. ముఖ్యంగా జూ పార్కు, అడవులు, టెంపుల్స్, బీచ్ వంటి ప్రాంతాలకు వెళ్లి.. వీకెండ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ సరదాలు విషాదాన్ని నింపుతాయి.
చాలా మందికి కుటుంబంతో కలిసి సరదగా బయటకు వెళ్లాలని కోరిక ఉంటుంది. అందుకే వీకెండ్స్ లో కుటుంబంతో కలిసి సందర్శనీయ స్థలాకు వెళ్తుంటారు. ముఖ్యంగా జూ పార్కు, అడవులు, టెంపుల్స్, బీచ్ వంటి ప్రాంతాలకు వెళ్లి.. వీకెండ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ సరద యాత్రాల్లో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ లెక్చరర్ కుటుంబం వీకెండ్ ను సంతోషంగా గడపాలని జూకు వెళ్లింది. అయితే అక్కడ జరిగిన ఓ ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తిరుపతి పట్టణంలోని రాయల్‌నగర్‌కు చెందిన మనోజ్ బెంగళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్నారు. ఆయనకు సుష్మ అనే యువతితో కొన్నేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మనోజ్ బెంగళూరులో పని చేస్తుండగా సుష్మ.. పిల్లలతో కలిసి తిరుపతిలోనే ఉంటుంది. ఇక ఇటీవలే పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో సుష్మ తన ముగ్గురు పిల్లలను జూకు తీసుకెళ్లాలనుకుంది. అయితే తన ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడి కుమారుడిని సుష్మ జూ పార్కుకు తీసుకెళ్లింది.
ఇలా జూలో తన కుమారుడు ప్రణవ్ నారాయణను ఓ చేత్తో.. మేనల్లుడిని మరో చెత్తో పట్టుకుని సుష్మ నడిచి వెళుతున్నారు. అలా అక్కడి జంతువులను చూస్తూ సరదాగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. అదే సమయంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనం ఒకటి సుష్మ వాళ్లు తిరుగుతున్న వైపు వచ్చింది. రోడ్డువైపు సుష్మతో నడిచి వెళ్తున్న ప్రణవ్ ను ఆ బ్యాటరీ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ బాలుడు ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయాడు. బ్యాటరీ వాహన చక్రాలు ఆ బాలుడిపైకి ఎక్కి వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణవ్ ను వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే బాలుడు చనిపోయాడని వైద్యులు వెల్లడించారు. అప్పటి వరకు తన ముందే ఉన్న బిడ్డ చనిపోయాడని తెలియడంతో సుష్మ బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. బ్యాటరీ వాహన డ్రైవర్ అజాగ్రత్త కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.