ఎన్నికలకు రెండేళ్ల ముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కెయ్యాయి. ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్షాలు విమర్శలు- ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నారు. మీడింగ్లు, బహిరంగ సభల్లో అప్పుడే ఎన్నికల గురించి ప్రచారాలా మొదలు పెట్టేశారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ప్రజలతో నాడు- నేడు, ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి చర్చిస్తున్న సమయంలో జై జగన్ నినాదాలు చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయంపై మంత్రి రోజా కూడా స్పందించారు.
ఇదీ చదవండి: AP హైకోర్టు సంచలన తీర్పు.. ముగ్గురు IASలకు నెల రోజులు జైలు!
విలేఖరులతో మాట్లాడుతున్న సమయంలో మంత్రి రోజా ఈ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ వీడియోపై మంత్రి రోజా మాట్లాడుతూ.. ‘పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. టీ కొట్టు దగ్గర చంద్రబాబు చర్చ పెట్టడం చూశారు. అక్కడున్న యువకులు, ప్రజలు అందరూ జై జగన్ అంటూ నినాదాలు చేశారు. మేము జగన్ వెంటే ఉంటామని ముఖం మీదే చెప్పేసినా.. చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని తిరుగుతున్నారో ఆయనకే తెలియాలి’ అంటూ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు, వార్తలపై టీడీపీ సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు స్పందించారు.
వైరల్ అవుతున్న వీడియో ఎడిటింగ్, మార్ఫింగ్ చేసిందని ఇదిగో అసలు వీడియో అంటూ అయ్యన్న పాత్రుడు ట్వీట్ చేశారు. ఈ విషయంపై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన స్క్రిప్ట్ లో డైలాగులతో ఉతికేయడానికి ఇది టీవీ షో కాదంటూ ఎద్దేవా చేశారు. అసలు తాళ్ల వలస ఎక్కడుందో కూడా తెలియకుండా వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ చురకలు అంటించారు. విశాఖ జిల్లా తాళ్లవలసను, శ్రీకాకుళం జిల్లా అంటూ చెప్పడాన్ని తప్పుబట్టారు. స్థానికులు జై బాబు అని అరుస్తుంటే.. జై జగన్ అని అన్నారంటూ కోడి కత్తి కతలు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీర్ పేట ఎడిటింగ్, మార్కాపురం మార్ఫింగులతో ఇంకెన్నాళ్లు నాటకాలు ఆడతారంటూ దుయ్యబట్టారు. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు, ఈ వీడియో వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
రోజా ఆంటీ అరంగుళం మేకప్ వేసుకుని వచ్చేయడానికి ఇది జబర్దస్త్ షో కాదు.
స్క్రిప్ట్ లో డైలాగులతో ఉతికేయడానికి ఇది బతుకుజట్కా బండి షో కాదు.
దొంగ పెట్టిన దొంగ చానల్ సాక్షి వాళ్ల స్క్రిప్టు పట్టుకుని వస్తే ఇలాగే అడ్డంగా బుక్కయిపోతావు.
1/3 pic.twitter.com/nuWzdFmEzN— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 6, 2022
అమీర్‌పేట ఎడిటింగులు, మార్కాపురం మార్ఫింగ్‌లతో ఇంకెన్నాళ్లీ జగన్ నాటకం.3/3
— Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 6, 2022