కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి ప్రపంచమంతా నానా కష్టాలు పడుతోంది. వైద్య వృత్తినే సవాలు చేస్తోంది ఈ చైనా వైరస్. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో ఓ అద్భుతం చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా.. ముత్తుకూరు మండలం.. కృష్ణ పట్నంలో ఉచితంగా ఇస్తున్న కరోనా ఆయుర్వేద మందు కరోనా నివారణలో అద్భుతంగా పని చేసింది. దీనితో.., ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలలో కూడా ఇప్పుడు ఈ ఆయుర్వేద ముందుకి సంబంధించిన వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇందులో శాస్త్రీయత లేదంటూ కొందరు లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్బాబు ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలో అందిస్తున్న ఆయుర్వేద మందు పంపిణీని పరిశీలించారు. దీనిపై మెడికల్ ట్రయల్స్ పూర్తయ్యేంత వరకు మందు పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసింది. అయితే అయుర్వేద మందును అందజేయాల్సిందిగా ప్రజల నుంచి విజ్ఞప్తులు వెల్లువెత్తడంతో.., ఈ మందుని టెస్ట్ చేసిన అధికారులు పంపిణీకి పాక్షిక అనుమతి ఇచ్చారు. ఈ ఆయుర్వేద మందు వాడితే… కరోనా ఏ స్థాయిలో ఉన్నా కేవలం రెండు రోజుల్లోనే నెగెటివ్ రావడం, పాజిటివ్ వచ్చినప్పుడు సీటి స్కాన్ లో చెస్ట్ సివియారిటీ స్కోర్ 24/25 ఉన్నా.., ఈ మందు వాడిన తరువాత కేవలం రెండు రోజుల్లోనే నార్మల్ రిపోర్ట్స్ రావడం, ఆక్సిజన్ అందక తీవ్ర విషమ పరిస్థితుల్లో ఉన్న వారు కూడా ఒక్కరోజులో లేచి కూర్చోవడం వంటి అద్భుతాలు ప్రజల కళ్ళ ముందే జరిగాయి. పైగా.., ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు.
కృష్ణపట్నం గ్రామంలో బొణిగి ఆనందయ్య తన మిత్రులతో కలిసి కరోనా నివారణకు ఈ ఆయుర్వేద వైద్యం అందిస్తున్నారు. గతేడాది కరోనా బారిన పడిన ఆనందయ్య మొదట ఆ మూలికా వైద్యాన్ని తన మీదే ప్రయోగించి కరోనా నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత తన బంధువులకు కూడా ఈ వైద్యం సత్ఫలితం ఇవ్వడంతో ఈ ఏడాది ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. బొణిగి ఆనందయ్య ఒక్క పైసా కూడా డబ్బులు తీసుకోకుండా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో అందిస్తూ వచ్చాడు. ప్రజలకి ఈ ఆయుర్వేద మందుపై బాగా కుదరాగానే ఈ ముందుకి శాస్త్రీయత లేదు అంటూ అధికారులు అక్కడ వాలిపోయారు. లోకాయుక్త జిల్లా అధికారులను వివరణ కోరడంతో ముందుగా ఈ పంపిణీ ఆపించేశారు. ఆయుష్ మరియు ఇతర అధికారులు కృష్ణపట్నం చేరుకుని ఈ మందు ముడి సరుకుల వివరాలను సేకరించి పరీక్షల నిర్వహణకు ల్యాబ్ కు తరలించారు. అయితే.., ఈ పరీక్షల్లో నెల్లూరు ఆయుర్వేద మందు విజయం సాధించింది. దీనితో ప్రభుత్వ అధికారులే కృష్ణపట్నం ఆయుర్వేద మందు పంపిణీకి పాక్షిక అనుమతి తెలిపారు. ఈ మందులో వాడే ముడి పదార్ధాలు అన్నీ నిత్యం మనం ఇంట్లో వాడేవే కావడం, పైగా.., ఇవన్నీ చాలా పౌష్ఠిక ఆహరం కావడం వల్ల అధికారులు క్లియరెన్స్ ఇచ్చారు. అలాగే .. పాజిటివ్ ఉన్న వ్యక్తికి ఆక్సిజన్ లెవల్ 83 ఉన్నప్పుడు ఈ మందు ఇచ్చి టెస్ట్ చేశారు. ఈ ఆయుర్వేద మందు తీసుకున్న తరువాత 95 వచ్చిందని విచారణ అధికారులు ప్రత్యేకంగా చూసి ధ్రువీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. దీనితో కృష్ణపట్నం ఆనందయ్య ని మరో బోధిధర్మగా భావిస్తున్నారు ప్రజలు. అన్నీ అడ్డంకులు తొలగడంతో ఈ శుక్రవారం నుండి ఆయుర్వేద మందుని నెల్లూరు జిల్లా వరకు పంపిణీ చేయనున్నారు. త్వరలోనే మరిన్ని మెడికల్ ట్రైల్స్ చేయనున్నారు. ఒకవేళ అప్పుడు కూడా బెస్ట్ రిజల్ట్ వస్తే ఈ ఆయర్వేద మందుని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదేమైనా నెల్లూరు ఆయుర్వేద మందు పంపిణీ తిరిగి ప్రారంభం అవడం పట్ల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తునారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.