దేశంలోని ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. అయితే ఈ సమస్యపై ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తగ్గించేదు అనేక చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుంది. ఇక కరోనా కారణంగా గత రెండేళ్లు ఆన్ లైన్ జాబ్ మేళాలకు మాత్రమే ఏపీఎస్ఎస్ డీసీ పరిమితమైంది. అయితే ప్రస్తుతం నేరుగా కాలేజీల్లోనే జాబ్ మేళాలను నిర్వస్తోంది.
రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కృషి చేస్తుంది. ఏపీఎస్ఎస్ఎస్ డీసీ ఎండీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ… జాబ్ మేళాల ద్వారా 3 నెలల్లో (జూన్ నుంచి ఆగస్టు) 15,032 వేల మందికి ఉపాధి లభించిందని. ఉద్యోగానికి ఎంపికైన వారికి వారి అర్హతను బట్టి రూ.10 వేల నుంచి రూ.40 వేల వేతనం ఇవ్వడానికి కంపెనీలు సిద్దమైనట్లు తెలిపారు. గత మూడు నెలల్లో ఫ్లిప్ కార్ట్ సంస్థ ఏకంగా 2000 మందికి పైగా విద్యార్ధులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంది. డైకిన్ వంటి పలు ఎలక్ట్రానికి కంపెనీలు, ప్రైవేటు బ్యాంకులు , హాస్పిటల్స్ వంటి వాటిల్లో అత్యధిక మందికి ఉపాధి లభిస్తున్నాయి.
ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 142కు పైగా జాబ్‌మేళాలను నిర్వహించగా, 37,879 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాల్లో 146కు పైగా ప్రఖ్యాత కంపెనీలు పాల్గొన్నాయి. ఈ విద్యా సంవత్సంరం ముగిసేలోపు జాబ్ మేళాల ద్వారా 45 వేల మందికి ఉపాధి కల్పించాలని టార్గెట్ గా పెట్టుకున్నట్లు ఎస్.సత్యనారాయణ తెలిపారు. మరి.. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా ఇలా ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహిస్తూ.. యువతకి ఉపాధి కల్పిస్తున్న వైసీపీ ప్రభుత్వ పని తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.