పదో తరగతి విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పదో తరగతి తుది పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేవెసులుబాటు కల్పించింది. విద్యార్థులు తమ వద్దనున్న హాల్ టికెట్ చూపించి పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
పదో తరగతి విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పదో తరగతి తుది పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విద్యార్థులు తమ వద్దనున్న హాల్ టికెట్ చూపించి పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రయాణించొచ్చని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. పరీక్షలు జరిగినన్ని రోజులూ ఈ వెసులుబాటు ఉండనుంది.
ఏపీలో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 3,348 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షలకు 6.64 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పదవ తరగతి ఫలితాల నుంచే పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని వెల్లడించిన బొత్స, బస్సుల కోసం విద్యార్థులు ఇక్కట్లు పడకుండా ఉండేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బస్సు రవాణా లేని చోట విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే డీఈఓ ద్వారా ఆర్టీసీకి విఙప్తి చేస్తే ప్రత్యేకంగా బస్సు సదుపాయం కల్పిస్తామని వివరించారు. మరోవైపు పరీక్షలనిర్వహణకొరకు విద్యాశాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అవసరమైన చోట పరీక్ష కేంద్రాలను నో సెల్‌ఫోన్ జోన్లుగా ప్రకటించారు. ప్రశ్నపత్రంలో ఏడు అంకెల ప్రత్యేక కోడ్‌ను ముద్రించారు. ఒకవేళ ఎక్కడైనా ప్రశ్నాపత్రం లీకేజీ అయినా.. ఆ పేపర్‌పై ఉన్న ఏడు అంకెల కోడ్‌ను బట్టి సులువుగా ఏ సెంటర్ నుంచి ప్రశ్నపత్రం బయటకు వచ్చిందో తెలుసుకోవచ్చు.