ఏపీపీఎస్సీ గ్రూప్- విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.
ఏపీపీఎస్సీ గ్రూప్- విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది. ఏప్రిల్ 23 నుంచి 29 వరకు గ్రూప్-1 మెయిన్స్ ను పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే తాజాగా ఆ పరీక్షలను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 3 నుంచి 9వ తేదీ దాకా పరీక్షలు జరుగుతాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది.
2022 సివిల్స్ సర్వీస్ పరీక్షలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు ఈ సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు జరగున్నాయి. ఈ షెడ్యూల్ ను యూపీఎస్సీ తాజాగా ప్రకటించింది. దీంతో గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూకి ఏపీ నుంచి పలువురు గ్రూప్-1 అభ్యర్థులు హాజరవుతున్నారు. అభ్యర్థులు భవిష్యత్ ని దృష్టిలో ఉంచుకుని గ్రూప్-1ను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు సలాంబాబు తెలిపారు.