మన జీవితంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో.. ఏ రూపంలో ప్రమాదం మన దరికి వస్తుందో అంచనా వేయడం కష్టం. అసలు మరుక్షణం ఏం జరుగుతుందో మనకు తెలియదు. వీటికి తోడు మారుతున్న జీవనశైలి కారణంగా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రూపంలో మృత్యువు పలకరిస్తుంది. ఇక గత కొంతకాలంగా సంభవిస్తున్న మరణాలను చూస్తే.. చాలా ఆశ్చర్యం కలగడమే కాక.. భయం కూడా వేస్తుంది. అప్పటి వరకు ఆడుతూ, పాడుతూ ఎంతో ఉత్సాహంగా ఉన్న వారు.. ఉన్నట్లుండి మృత్యువాత పడుతున్నారు. కారణం.. కార్డియాక్ అరెస్ట్. శ్రీదేవి, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇలానే మృతి చెందారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. షటిల్ ఆడుతున్న యువకుడు ఉన్నట్టుండి కోర్టులోనే కుప్పకూలిపోయి.. మృతి చెందాడు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు షటిల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గేమ్ ఆడుతుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. చిలకలూరిపేట మున్సిపల్ మాజీ ఛైర్మన్, దివంగత మల్లెల బుచ్చయ్య మనవడు కిశోర్.. ఓ ప్రైవేట్ షటిల్ క్లబ్‌లో షటిల్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. స్నేహితులు వెంటనే ఆస్పత్రికి తరలించినా.. అప్పటికే కిశోర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. హఠాత్తుగా గుండెపోటు రావడం, తలలో నరాలు తెగిపోవటం వంటి సందర్భాల్లో ఇలా జరుగుతుందని వైద్యులు వెల్లడించారు. యువకుడి హఠాన్మరణంతో.. అతడి కుటుంబంతో పాటు.. ఆ ప్రాంతంలో తీరని విషాదం అలుముకుంది. మరి ఈ దుర్ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Draupadi Murmu: ద్రౌపది ముర్ము.. స్కూల్ టీచర్ నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా!
ఇది కూడా చదవండి: తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న నిత్యపెళ్లికూతురు! పోలీసులకే సవాలు!