ఒక వ్యక్తి చాలా ఏళ్లు కష్టపడి ఎందులోనైనా విజయం సాధిస్తే … ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో సంతోషిస్తారు. అదే కుటుంబంలో మరొకరు విజయం సాధిస్తే.. ఇక వారి ఆనందాలకు అవధులుండవు. అచ్చం అలానే ఓ కుటుంబం విషయంలో జరిగింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి .. ఇక రాదని వ్యవసాయంలోకి దిగిన ఓ వ్యక్తికి ఏళ్లు గడిచిన తరువాత ఇటీవల డీఎస్సీ-98 రూపంలో ఉద్యోగం వచ్చింది. ఇక ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన తెలంగాణ ఎంసెట్ లో ఆయన కుమారుడు రెండో ర్యాంకు సాధించాడు. ఇక ఆ కుటుంబం సభ్యుల సంతోషానికి అవుధులేవు. వివరాల్లోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ లోని ఎ.కోడురూ ప్రాంత గ్రామమైన పొడుగుపాలెంకు చెందిన వంటాకు గౌరునాయుడు, దేముడమ్మ వ్యవసాయం చేస్తుంటారు. వీరి కుమారుడు వంటాకు రోహిత్. గౌరునాయుడు ఎంఎస్సీ, ఎంఈడీ చేసి.. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ఎన్నో చేశారప. చివరకు ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన 1998 డీఎస్సీ లో గౌరునాయుడు పేరు వచ్చింది. దీంతో ఇటీవల ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ వార్త ఆ కటుుంబంలో సంతోషాన్ని నింపింది. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం తెలంగాణ ఎంసెట్ లో మెడిసిన్ విభాగంలో గౌరునాయుడు కుమారుడు రోహిత్ రెండో ర్యాంకు సాధించారు.
దీంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఈ విద్యార్ధి ఒకటి నుంచి పదో తరగతి వరకు నర్సీపట్నంలో, ఇంటర్ బైపీసీ రాజమహేంద్రవరంలో పూర్తి చేశాడు. తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాని అతడి నిలబెట్టాడని స్థానికులు అభినందించారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.