తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. అయితే కేంద్రం మాత్రం ప్రత్యేక హూదా ఇవ్వడం కుదరదని చెప్పింది. కానీ ఇప్పుడు మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా అంశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి సిద్దమయింది. కేంద్ర హోంశాఖ ఎంజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చారు. ఈ మేరకు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఈ నెల 17న చర్చలకు రావాలని రాష్ట్రానికి కేంద్ర హోం శాఖ ఆహ్వానం పంపించింది.
హోదా ఇవ్వాలని పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రధాని నరేంద్రమోడీని కలిసి ఏపీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని మోడీని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఏడేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి త్రిసభ్ కమిటీ ద్వారా విభజన సమస్యలను పరిష్కరించాలని భావిస్తుంది.
ఇది చదవండి: సమతామూర్తిని దర్శించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్
1. ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ విభజన 2. ఏపి, తెలంగాణ మధ్య విద్యుత్ పంపిణీ 3.రెండు రాష్ట్రాల మద్య ఉన్న పన్ను బకాయీలు 4.రెండు రాష్ట్రాల మద్య బ్యాంకు డిపాజిట్ల చెల్లింపులు 5. విద్యుత్ సంస్థల మద్య వివాదం 6. వెనుకబడిన జిల్లాల అభివృద్ది గ్రాంట్ 7. రీసోర్సెస్ గ్యాప్ పై చర్చు 8. ఏపికి ప్రత్యేక హోదాపై చర్చ 9. పన్ను ప్రోత్సాహకాలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.