మద్యం అమ్మకాలపై,వాటి క్యాలీటి టెస్టింగ్ పై కీలక సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. మద్యం డిస్టిలరీకి సంబంధించిన విషయాలపైన ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్రంలో 2019లో ఉన్న డిస్టిలరీలే ఇప్పటికీ కొనసాగుతున్నాయి కొత్తగా ఎలాంటి డిస్టిలరీలకి అనుమతి ఇవ్వలేదు. రాష్ట్రంలో చివరి డిస్టలరీ అనుమతి 2019 ఫిబ్రవరిలో ఇచ్చారు. తర్వాత ఒక్క కొత్త డిస్టిలరీ కూడా రాష్ట్రంలో ఓపెన్ కాలేదు.
సప్లయర్లు వారి రేట్ కాంట్రాక్టు అగ్రిమెంట్లను పొడిగించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. మద్యం నియంత్రణకు ఏపీ ప్రభుత్వం 2020 మేలో కొత్త పాలసీ తెచ్చింది. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లను తొలగించింది. మద్యం షాపుల టైమింగ్ తగ్గించింది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణా అరికట్టేందుకు పెంచిన రేట్లను తగ్గించింది. ఎక్కడ లేని విధంగా మద్యం నాణ్యత పరీక్షలు ఏపీలో నిరంతరం జరుగుతుంది” అని భార్గవ స్పష్టం చేశారు.2014-18 మధ్య ఏపీలో ఏడాదికి 99 వేల శాంపిల్స్ టెస్ట్ చేశారు. అదే గతేడాది 1.55 లక్షల శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1.47 లక్షల శాంపిల్స్ టెస్ట్ చేశామని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఏడాదికి 1.6 లక్షల శాంపిల్స్‌ను టెస్ట్ చేయాలనే లక్ష్యంతో ఏపీ సర్కార్ ఉంది. 2014-19 మధ్య గణాంకాలతో పోలిస్తే ఏపీలో IMFL అమ్మకాల్లో 30 శాతం తక్కువగా ఉన్నాయి. అలాగే కెమికల్ పరీక్షలు 115 శాతం పెరిగాయి. “సెబ్” ఏర్పడినప్పటి నుంచి 12.5 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారుల తెలిపారు. మరి.. ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.