పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందని తేల్చిన పోలీసులు.. అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.పేపర్ లీకేజ్‌కు తావులేకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపడుతోంది.
తెలుగు రాష్ట్రాలలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3న ప్రారంభమైన ఈ పరీక్షలు 18వ తేదీ వరకు జరగనున్నాయి. ఇదిలావుంటే తెలంగాణను వరుస పేపర్ల లీకేజీల ఘటనల కుదిపేస్తున్న సంగతి అందరికీ విదితమే. తొలి రోజు ఆదిలాబాద్, తాండూరులో ప్రశ్నాపత్రం లీక్ అవ్వగా, రెండో రోజు వరంగల్ కమలాపూర్ బాయ్స్ హైస్కూల్ నుండి ప్రశ్నాపత్రం బయటకొచ్చింది. ఈ విషయపై తెలంగాణలో పెద్ద దుమారమే రేగుతోంది. ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందని తేల్చిన పోలీసులు.. అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. పేపర్ లీకేజ్‌కు తావులేకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పరీక్షల విషయంలో పేపర్ లీకేజ్‌కు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం పరీక్ష నిర్వాహకులకు కొన్ని జాగ్రత్తలు తెలియజేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకులు దేవానందరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పరీక్షా కేంద్రాలలో ఏవైనా అక్రమాలు, అవకతవకలు జరిగినచో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, సి-సెంటర్ కస్టోడియస్ లు బాధ్యత వహించవలసి ఉంటుందని దేవానందరెడ్డి స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలను నో మొబైల్ జోన్‌లుగా ప్రకటించామని, కావున విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ మొబైల్ ఫోన్లను ఇంటి వద్దే ఉంచి రావాలని లేనియెడల సెంటర్ లో పోలీస్ పికెటింగ్ వద్ద మొబల్ అప్పగించాలని తెలిపారు.
ఒకసారి పరీక్ష కేంద్రంలోకి వచ్చిన సిబ్బంది, పరీక్ష ముగిసేవరకు ఎటువంటి పరిస్థితులలో బయటికి వెళ్లకూడదన్నారు. అటెండర్లు, ఇతర సహాయకులు కూడా టీ, ఇతర శీతల పానీయాల వంటి అవసరాల పేరుతో పరీక్షా కేంద్రం దాటి బయటకు వెళ్లకూడదన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షకు హాజరు కాని అభ్యర్ధుల ప్రశ్నాపత్రాలను, మిగిలిన ప్రశ్నాపత్రాలను ఉదయం 10.00 గంటలలోపు ప్రశ్నాపత్రాల అకౌంట్ రాసి జాగ్రత్తగా సీల్ చేసి ఉంచాలని పేర్కొన్నారు. పై నిబంధనలు అతిక్రమించిన వారిపై పరీక్షల చట్టం 25/7 ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు శిక్షమరియు లక్ష రూపాయల వరకు జరిమానా పడుతుందని దేవానందరెడ్డి హెచ్చరించారు. ఈ చర్యలు పేపర్ లీకేజ్ ను ఆపగలవా..? మీ అభిప్రాయాలను కామెంట్లను తెలియజేయండి.