జగన్ ప్రభుత్వం ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్ చెప్పింది. చాన్నాళ్లుగా పోలీసులకు ఉన్న బకాయిలను సర్కారు విడుదల చేసింది. మరిన్ని వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులకు శుభవార్త చెప్పింది. చాలా కాలంగా పోలీసులకు ఉన్న బకాయిలను విడుదల చేసింది ఏపీ సర్కార్. పోలీస్ సిబ్బంది టీఏ నిధులను ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగుల జీపీఎఫ్ లోన్లను కూడా ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. పెండింగ్ నిధుల విడుదల మీద పోలీస్ అధికారుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి పోలీస్ అధికారుల సంఘం కృతజ్ఞతలు తెలిపింది. చాన్నాళ్లుగా పోలీసులకు బకాయిలు పెండింగ్లో ఉన్న సంగతి విదితమే. అయితే మొత్తానికి ఈ బకాయిలను ఇప్పుడు రిలీజ్ చేసింది ప్రభుత్వం. దీంతో పోలీస్ అధికారుల సంఘం జగన్ సర్కారుకు ధన్యవాదాలు తెలిపింది.