నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కోసారి రిలాక్స్ కావాలనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తే మనసుకు చాలా ప్రశాంతత కలుగుతుంది. వేసవిలో టూర్ అంటే అందరికి మహా సరదా. అందుకే కొంతమంది దూరంగా ఉన్న పుణ్య క్షేత్రాలకు వెళుతూ ఉంటారు. ఇలా అన్న పుణ్యం వస్తుందని భావిస్తుంటారు. అలా దూరప్రాంతాలకు వెళ్లినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం సమయస్ఫూర్తితో ఎదుర్కోవాలి. లేదంటే చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. తాజాగా, చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన కొందరు ఏపీ వాసులు నదీ ప్రవాహంలో చిక్కుకుపోయారు. స్థానికులు వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురానికి చెందిన కొందరు వ్యక్తులు చార్ ధామ్ యాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. అక్కడ వారు గంగానది కాలువలోకి దిగారు. వారు కాలువలో ఉండగానే ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. మిగతావారంతా ఒడ్డుకు చేరుకోగా ముగ్గురు మాత్రం నీటిలోనే చిక్కుకుపోయారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఎటూ వెళ్లలేక పెద్ద రాతిపై నిలబడ్డారు. నీటిలో చిక్కుకున్న వారిలో ఒక మగవ్యక్తి, ఇద్దరు ఆడవారు ఉన్నారు. చూస్తుండగానే నీళ్లు చుట్టూ చేరాయి.వెంటనే అక్కడికి కొందరు స్థానికులు చేరుకున్నారు. వారు పెద్ద తాళ్ల సాయంతో ఆ ముగ్గురిని కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.