రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. వేడికి తాళలేక జనాలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే.. ఇక మే నెల వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో అని జనాలు భయపడుతున్నారు. ఇక ఎండ వేడి ఎంత తీవ్రంగా ఉందో అద్దం పట్టే సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ఎండలు మండి పోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడికి తాళలేక జనాలు బయటకు రావాలంటేనే భయపడి పోతున్నారు. మరి మధ్యాహ్నం పూట వేడి భరించలేకుండా ఉన్నాం. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8-9 గంటల వరకు వాతావరణం చాలా వేడిగా ఉంటుంది. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని.. జనాలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే రెండు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం కాస్త చల్లబడింది. హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కానీ ఏపీలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడి తీవ్రతకు అద్దం పట్టే సంఘటన ఒకటి వెలుగు చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండి పోతున్నాయి. ఏప్రిల్‌లోనే పరిస్థితి ఇలా ఉంది అంటే.. ఇక మే నెలలో ఎంత తీవ్రంగా ఉంటుందో అని భయపడుతున్నారు. ఇక ఏపీలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఎండ వేడికి కారు ఒకటి తగలబడింది. నడి రోడ్డుపై ఈ షాకింగ్ ఘటన వెలుగు చూడటంతో జనాలు భయంతో పరుగులు తీశారు. పల్నాడు జిల్లాలోని రెంటచింతలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న కారు.. ఎండ వేడికి తగలబడింది. ఆ సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
ఇక ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రెంట చింతలలో ఎండలు మండిపోతాయని అంటున్నారు. ఈ ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు, రాతి పలకలతో కూడిన నేల ఉండటం వల్ల ఇక్కడ వేసవి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి అంటున్నారు భౌగోళిక శాస్త్రవేత్తలు. ఐతే శీతా కాలం లో మాత్రం ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది అంటున్నారు స్థానికులు. ప్రస్తుతం రెంట చింతలలో 43॰ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందిని.. రానున్న రోజులలో ఎండలు మరింత ముదిరిపోయో అవకాశం ఉందంటున్నారు అధికారులు.