ఈ మధ్య కాలంలో పెళ్లిల్ల పేరుతో జరుగుతున్న మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పేరు, ఊరు మార్చుకుని.. వరుస పెట్టి పెళ్లిల్లు చేసుకుంటున్నారు. అందినకాడికి దండుకుని.. ఆ తర్వాత పత్తా లేకుండా పోతున్నారు. ఒకప్పుడు ఇలాంటి మోసాల్లో ఎక్కువగా మగవాళ్ల పేర్లు వినిపించేవి. కానీ ఇప్పుడు ఈ తరహా మోసాలకు పాల్పడే కిలేడీల సంఖ్య పెరుగుతోంది. అమాయకంగా నటించడం, మాయమాటలతో వంచించి పెళ్లి చేసుకోవడం.. ఆ తర్వాత నయానోభయానో వారి వద్ద నుంచి డబ్బులు లాగడం.. ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లాడటం. ఇదే తంతు వీరిది. తాజాగా ఈ కోవకు చెందిన కిలేడీ మహిళను ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె ఇప్పటి వరకు ఏకంగా ముగ్గురిని పెళ్లాడింది. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంది. ట్విస్ట్ ఏంటంటే.. వీరిలో ఒక్కరికి కూడా విడాకులు ఇవ్వలేదు. ఆమె తీరుపై అనుమానం వచ్చి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
సదరు కిలేడీది నంద్యాల జిల్లా, మిట్నాల గ్రామం. పేరు శిరీష(24). ఇప్పటి వరకు మూడు వివాహాలు చేసుకుంది. వారిలో ఒక్కరికి కూడా విడాకులు ఇవ్వలేదు. వారి వద్ద నుంచి డబ్బులు తీసుకోవడం.. ఆ తర్వాత వేరే చోటుకి మకాం మార్చడం ఇదే తంతు. మూడో భర్తకు ఈమె వ్యవహారం కాస్త తేడాగా కొట్టడంతో ఆరా తీశాడు. దాంతో మూడు పెళ్లుల్లు చేసుకున్న విషయం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిట్నాలకు చెందిన శిరీషకు తొలుత అవుకు మండలం చెన్నంపల్లెకు చెందిన మల్లికార్జున్‌తో వివాహం అయ్యింది. అతడితో విడాకులు తీసుకోకుండానే.. ఆత్మకూరు మండలం కొత్తపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డిని రెండో వివాహం చేసుకుంది.
ఇది కూడా చదవండి: Nandigama: చెల్లికి న్యాయం చేయాలంటూ తల్లితో కలిసి సోదరుడు ఢిల్లీకి ఎడ్లబండిపై యాత్ర!
అతడికి కూడా విడాకులు ఇవ్వకుండానే.. బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్ రంగాపురం వాసి అయిన మహేశ్వర్ రెడ్డిని ముచ్చటగా మూడో పెళ్లి చేసుకుంది. అతడికి కూడా ఇది రెండో వివాహం కావడంతో.. శిరీష అడిగినట్లు.. ఆమె పేరు మీద 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడు. ఫిబ్రవరి 1న డబ్బులు డిపాజిట్ చేయగా.. ఫిబ్రవరి 5న వివాహమైంది. అయితే శిరీష తల్లి తరచు మహేష్ రెడ్డి ఇంటికి వస్తూ.. తన కుమార్తెని అత్తారింట్లో ఉంచాలంటే.. మరి కొంత నగదు ఇవ్వాలని, ఆస్తి రాసివ్వాలని డిమాండ్ చేయసాగింది. అనుమానం వచ్చిన మహేశ్వర్ రెడ్డి.. శిరీష గురించి విచారించగా.. ఆమెకు అప్పటికే రెండు సార్లు వివాహమయ్యిందని.. వారికి విడాకులు ఇవ్వకుండానే.. తనను మూడో వివాహం చేసుకుందని తెలిసి అవాక్కయ్యాడు. వెంటనే శిరీష మీద పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిలేడీ చేసిన మోసాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ప్రేమ వివాహం..యువకుడి చెవు కొరికి, కర్రలతో దాడి!
ఇది కూడా చదవండి: Dancers: ప్రేమ వివాహం చేసుకున్నారు.. ఏడాది కూడా కాకుండానే భార్య..!