ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు వివాదానికి ముగింపు పలికేందుకు గాను చిరంజీవి సహా ఇండస్ట్రీకి చెందిన పలువురు.. సీఎం జగన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో అందరికి ఆమోదయోగ్య రీతిలో సినిమా టికెట్ రేట్లు ఉండేలా చూస్తానని సీఎం జగన్ తెలిపారు. ఈ క్రమంలో సినిమా టికెట్ ధరలను నిర్ణయిస్తూ.. ప్రభుత్వం ఫిబ్రవరి 22, 2022న జీఓ విడుదల చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ జీఓ ప్రకారం గ్రామీణ, మండల, మున్సిపాలిటీ ప్రాంతాల వారీగా సింగిల్ స్క్రీన్ సినిమా టికెట్ల ధరలు ఇలా ఉండనున్నాయి.గ్రామీణ ప్రాంతాల్లో సినిమా టికెట్ ధర కనిష్టంగా 40 రూపాయలు ఉండనుండగా.. గరిష్టంగా 100 రూపాయలు ఉండనున్నట్లు సమాచారం.
గ్రామీణ ప్రాంతాల్లో-100/- 60/- 40/-
మండల ప్రాంతాల్లో కనిష్టంగా 50 రూపాయలు ఉండనుండగా.. గరిష్టంగా 120 రూపాయలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
మండల ప్రాంతాల్లో– 120/- 70/- 50/-
మున్సిపాలిటీల్లో సినిమా టికెట్ ధర కనిష్టంగా 50 రూపాయలు ఉండనుండగా.. గరిష్టంగా 150 రూపాయలు ఉండనున్నట్లు సమాచారం.
మున్సిపాలిటీల్లో-150/- 100/- 50/-
ఇవే కాక శుక్ర,శని, ఆది వారాల్లో ఐదు షోలకు అవకాశం కల్పించడమే కాక.. రెమ్యూనరేషన్ కాకుండా, నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు అంతకుమించి బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా టికెట్ల ధరలు వారం రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జీఓ విడుదల అయితే దీనిపై ఓ క్లారిటీ రానుంది.