ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే కోసం ఏకంగా ప్రత్యేక చాపర్‌ను పంపిందో పార్టీ అధిష్టానం. ఎవరా ఎమ్మెల్యే? ఎందుకిలా చేశారంటే..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక దాదాపుగా ముగిసింది. అయితే మొత్తం 175 ఓట్లు ఉండగా.. ప్రస్తుతానికి 174 ఓట్లు పోల్ అయ్యాయి. ఒక వైసీపీ ఎమ్మెల్యే ఓటు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌కు సమయం ఉండటంతో ఏ క్షణమైనా వచ్చి.. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా తన ఓటును పక్కాగా తమకు అనుకూలంగా వేస్తాడని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఒక్క వైసీపీ ఎమ్మెల్యే ఎవరు? ఆయన ఓటింగ్‌కు ఎందుకు హాజరు కాలేదు? ఆయన కోసం పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఒక చాపర్‌ను ఎందుకు పంపించింది అనేది ఆసక్తికరంగా మారింది.
ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు.. విజయనగరం జిల్లాలోని నెలిమర్ల నియోజకవర్గానికి చెందిన బడ్డుకొండ అప్పలనాయుడు. అప్పలనాయుడి కుమారుడి వివాహం ఇవాళే ఉండటంతో ఆయన ఎమ్మెల్సీ ఓటింగ్‌కు హాజరయ్యేందుకు కుదర్లేదు. అయితే పెళ్లి తంతు ముగియగానే ఓటేసేందుకు ఆయన విజయవాడకు రానున్నారు. అప్పలనాయుడు వచ్చేందుకు ఎలాంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం ఆయన కోసం ప్రత్యేకంగా ఒక చాపర్‌ను పంపింది. ప్రత్యేక చాపర్‌లో విజయవాడకు వచ్చాక.. అక్కడి నుంచి నేరుగా పోలింగ్ కేంద్రానికి చేరుకునేలా అప్పలనాయుడు కోసం ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయన ఓటు మీద ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.