ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఏపీ కేబినెట్ లో మార్పులు జరగబోతున్న విషయంపై వార్తలు వస్తున్నాయి. ఈ క్రమయంలో ప్రస్తుత మంత్రులందరి నుంచి ప్రభుత్వం రాజీనామాలు కోరనుంది. మంత్రి మండలి సమావేశంలో సీఎం జగన్ మంత్రుల రాజీనామా కోరనున్నట్లుగా సమాచారం. ఈ ప్రక్రియ అనంతంరం ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం ఆధ్వర్యంలో పూర్తి చేయనున్నారు. అయితే ఈ రాజీనామాలు ఇద్దరు మంత్రుల మినహా మిగిలిన వారు అందరూ సమర్పించబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఏపి మంత్రులుగా వ్యవహరిస్తున్నవారికి ఇదే చివరి సమావేశం అని అంటున్నారు. ప్రస్తుతం ఆయన పాతిక మందిని రాజీనామా కోరినట్లు సమాచారం అందుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు మంత్రి మండలి చివరి సమావేశం జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఈ భేటీలో ముఖ్యమంత్రి జగన్, మంత్రుల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే మంత్రి మండలి సమావేశ ఎజెండా ఎలా ఉండబోతుందో అన్న విషయం సిద్దం చేశారు. ఈ సమావేశంలోనే మంత్రుల రాజీనామాను సీఎం జగన్ కోరే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సామాజిక వర్గాల వారీగా మంత్రిమండలిలో ప్రాధాన్యం కల్పిస్తామని రెండున్నరేళ్ల క్రితమే సీఎం జగన్ ప్రకటించారు. ఇక ఏప్రిల్ 11 వ తేదీన కొత్త మంత్రి మండలి ఏర్పాటు కానుంది.