ఏపీ మంత్రవర్గ విస్తరణలో భాగంగా ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌కి మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సొంత నియోజకవర్గంలో పర్యటించారు ఉషశ్రీ చరణ్. అంతేకాక ఆలయాలను సందర్శిస్తూ.. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సొంత నియోజకవర్గ పర్యటనలో భాగంగా కసాపురం ఆంజనేయ స్వామిని సందర్శించారు మంత్రి ఉష శ్రీ చరణ్. ఆమెకు ఘనస్వాగతం పలికిన ఆలయ సిబ్బంది… ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: పార్టీ మార్పు వార్తలపై స్పందించిన బై రెడ్డి సిద్దార్ద్ రెడ్డి!
ఆలయంలో మంత్రి ఉష శ్రీ చరణ్‌కి తీర్థప్రసాదాలు అందజేస్తున్న సమయంలో అకస్మాత్తుగా అక్కడకు ఓ కోతి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ వానరం నేరుగా వచ్చి ఉష శ్రీచరణ్ ఒడిలో కూర్చొంది. అయితే కోతిని చూసిన మంత్రి గానీ ఆమె అనుచరులుగానీ ఎలాంటి ఆందోళనకు గురి కాలేదు. పైగా కోతిని ఏమీ అనలేదు కూడా. దాంతో అది కాసేపు మంత్రి ఒడిలో కూర్చొంది. ఆ టైంలోనే గుడిలో పూజారులు ఉష శ్రీ చరణ్ ని ఆశీర్వదించారు.
ఇది కూడా చదవండి: సీఎం కేసీఆర్‌పై గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు!ప్రత్యేక పూజలు, ఆశీర్వాదాలు పూర్తైన తర్వాత మంత్రి ఉష శ్రీ చరణ్‌కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అప్పటికీ అక్కడే ఉన్న కోతి… వాటిని పరీక్షగా చూసింది. అందులో ప్రసాదం పెట్టిన బాక్స్‌ను కూడా చూసింది. అయితే కోతి ప్రసాదం బాక్స్ ని తీసుకెళ్తుంది అని అందరు భావించారు. కానీ వానరం ఆ పని చేయలేదు. అక్కడ ఉన్న వ్యక్తి ఒకరు.. ఆ బాక్స్‌లోని ప్రసాదాన్ని తీసి కోతికి ఇచ్చాడు. కానీ దాన్ని తీసుకోలేదది. పూజ కార్యక్రమాలు ఇంకా జరుగుతుండగానే వానరం అక్కడ నుంచి లేచి సైలెంట్‌గా వెళ్లిపోయింది. మంత్రి కూడా తన పర్యటన ముగించుకొని వెళ్లిపోయారు. ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: 3 ఏళ్ళ క్రితం మాట కోల్పోయాడు! కానీ.., వీరబ్రహ్మేంద్రస్వామి మాల వేయగానే అద్భుతం!