తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నేతలు ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం సధారణంగా జరుగుతూనే ఉంటుంది.. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపిలో కరెంట్, నీటి వసతుల గురించి సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపిలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి ఎంతో ఘోరంగా ఉందని.. ఈ విషయం ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు చెప్పారని ఆయన అన్నారు. అక్కడికి వెళ్లి వచ్చినవారు తెలంగాణ రోడ్ల పరిస్థితి చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపి మంత్రులు, ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు.
ఏపీ పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో మంత్రి రోజా తనదైన స్టైల్లో కేటీఆర్ మాటలను తిప్పికొట్టారు. తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆమె కుటుంబ సభ్యులతో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ విషయంలో మంత్రి కేటీఆర్ ని బహుషా ఇక్కడ పరిస్థితులపై అవగాహన లేనివారు తప్పుదోవ పట్టించి ఉండొచ్చని.. ఆయన ప్రత్యేకంగా ఏపి అనలేదని అన్నారు. ఇకవేల అలాగే అని ఉంటే.. తాను ఈ విషయం ఖచ్చితంగా ఖండిస్తున్నా అన్నారు.
ఏపికీ మంత్రి కేటీఆర్ ని సాధరంగా ఆహ్వానిస్తున్నానని.. ఆయన తన స్నేహితుడిని వెంట తీసుకొని వస్తే దగ్గరుండి ఇక్కడ అభివృద్ది ఏంటో చూపిస్తానని అన్నారు. కేంద్రంతో కలిసి హైవేల నిర్మాణం ఎంత గొప్పగా జరుగుతుంది.. ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ గురించి దేశం చర్చించుకుంటుందని ఆమె అన్నారు. కేటీఆర్ కు ఆయన ఫ్రెండ్ చెప్పింది తప్పని తెలుసుకుంటారన్నారు. ఆయన తన సమయాన్ని కేటాయిస్తే.. నేను ఏపి మంత్రిగా చూపిస్తానని అన్నారు.