ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రోజా ఓ సంచలనం. ఒక హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి రాజకీయ నేతగా ఎదిగి.. ఇప్పుడు ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. ప్రజాసేవలో మమేకం అయ్యేందుకు జబర్దస్త్ వంటి షోలకు, బుల్లితెర ఈవెంట్లకు కూడా దూరం కానున్నట్లు ప్రకటించి అందరి మన్ననలు పొందారు. ఇదంతా మంత్రి రోజా ప్రస్థానం.. అయితే ఆమె కుమార్తె అన్షు మాలిక కూడా రోజాకు ఏ మాత్రం తీసిపోకుండా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మంచి మనసు, సమాజం పట్ల ఆమెకున్న అవగాహన, సేవ చేయాలనే గుణం అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు అన్షు చేసిన, చేస్తున్న పనులు చూసి అందరూ షాకవుతున్నారు. తల్లికి తగ్గ కుమార్తె అంటూ పొగిడేస్తున్నారు. అసలు అన్షు మాలిక చేసిన ఆ సేవలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదీ చదవండి: ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్
రోజా కుమార్తె అన్షు మాలిక చిన్న వయసులోనే బుక్స్ రాసిందని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆమె చేసిన మంచి పనులు చాలా మందికి తెలియదు. అవేంటంటే.. స్కూల్ వయసులోనే అన్షు మాలిక ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్స్ చెప్పేది. ఫీజు కోసం కాదులెండి.. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు చదువు చెప్పేది. వారికి కావాల్సిన పుస్తకాలు ఇవ్వడం, చదువువైపు వారు ఆకర్షితులయ్యేలా చేసింది. ఆ తర్వాత కోడింగ్ లాంగ్వేజ్ మీద ఆసక్తి ఉండి.. ఎలా నేర్చుకోవాలి? ఎక్కడ నేర్చుకోవాలో తెలియక డైలమాలో ఉండే వారిని గైడ్ చేసేది. వారి కోసం ట్రాన్స్ ఫార్మింగ్ విత్ కోడింగ్ అనే స్కూలింగ్ క్లబ్ ఏర్పాటు చేసింది. చదువుకునే ఆర్థికస్థోమత లేని పిల్లల కోసం ఓ యాప్ తయారు చేసింది.
అన్షు ఈ వయసులోనే అమ్మగా కూడా మారింది. ఐదుగురు అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకుంటోంది. అక్కడితో ఆగలేదు.. స్మైల్ హండ్రెడ్ అనే పేరుతో ఓ సంస్థను స్థాపించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వంద మంది విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తన వంతు కృషి చేస్తోంది. అన్షు చేస్తున్న పనులు చూసి రోజా దంపతులు ఎప్పుడూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంటారు. అంతేకాదు రోజా అభిమానులు, అనుచరులు కూడా అన్షు చేస్తున్న పనులు చూసి గర్వంగా ఫీలవుతుంటారు. అయితే రోజా మంత్రి అయ్యాక ఆమె గురించి, కుటుంబ నేపథ్యం, పిల్లల గురించి సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్షు చేసిన పనులు చూసి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు. కొందరైతే తల్లి రాజకీయాల్లోకి వచ్చాక ప్రజా సేవ మొదలు పెటితే.. కుమార్తె చిన్నప్పటి నుంచే సమాజ సేవ చేస్తోందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అన్షు మాలిక చేస్తున్న ఈ సేవలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.