తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి రోజా తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రోజా నగరి నియోజకవర్గం నుండి రెండుసార్లు శాసనసభ్యురాలిగా ఎన్నికైంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి అయ్యారు రోజా. శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరంజీవి హిట్ సాంగ్ చామంతి పూవా.. పాటకు అదిరిపోయే స్టెప్పు వేశారు మంత్రి రోజా. వివరాల్లోకి వెళితే..
శ్రీకాకుళం జిల్లాలోని మూడు రోజులుగా మెగా మ్యూజికల్ ఈవెంట్ జరుగుతోంది. ముగింపు ఉత్సవ వేడుకల్లో ఏపీ మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా స్టేజ్ పైన వారందరితో ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. చప్పట్లు.. కేరింతలతో అక్కడి వాతావరణం మొత్తం కోలాహలంగా మారిపోయింది.
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని.. స్వాతంత్ర దినం 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో వజ్రోత్సవాలలో భాగంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అధికారుల్ని అభినందించారు. మూడు రోజుల పాటు ధ్యాన, నాట్య, సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా అనిపించిందని ఆమె అన్నారు. ఈ వీడియో పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.