మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ వేరే ఏ ఉద్యోగానికి ఉండదు. లక్షల్లో వేతనం ఇచ్చినా సరే.. చాలా మంది అలాంటి ఉద్యోగాలను వదులుకుని మరి.. ప్రభుత్వ కొలువు కోసం ప్రయత్నిస్తారు. ప్రభుత్వ కొలువుకు ఉండే భద్రత ఏ ప్రైవేటు ఉద్యోగానికి ఉండదు. అందుకే చదువు పూర్తయిన ప్రతి ఒక్కరు చిన్నదో, పెద్దదో ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలానుకుంటారు. ఇక ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంత తేలికైన పనేం కాదు.
వందల్లో ఉన్న ఉద్యోగాల కోసం లక్షల్లో అభ్యర్థులు పోటీ పడతారు. ఇంత పోటీని తట్టుకుని ఉద్యోగం సాధించిన వారికి కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. ఇప్పుడు మీరు చదవబోయే యువకుడు కూడా ఇలానే కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. అయితే దురదృష్టం అతడిని ‘కాలు’ రూపంలో వెక్కిరించింది. కోర్టుకు వెళ్లినా ప్రయోజనం దక్కలేదు. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: CM జగన్ ఢిల్లీ పర్యటన.. ఆసక్తికర సన్నివేశం.. అభినందిస్తున్న జనాలు!రవాణా శాఖలో ఏఎంవీఐ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ 2018లో నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ క్రమంలో కడప జిల్లా, రాయచోటి మండలానికి చెందిన నల్లమల నాగేశ్వరయ్య ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. 2019లో నిర్వహించిన పరీక్షల్లో నాగేశ్వరయ్యకు 300 మార్కులకు గాను 194.26 మార్కులు వచ్చాయి. మెరిట్ జాబితాలో అతనిది రెండో స్థానం. రాత పరీక్ష తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తుది ఫలితాల్లో అతని పేరులేదు.
ఏంటని ప్రశ్నిస్తే.. కుడిపాదం చదునుగా ఉండటంతో అతన్ని ఎంపిక చేయలేదు అని తెలిపారు అధికారులు. దీంతో నాగేశ్వరయ్య నోటిఫికేషన్‌తో పాటు ఇందుకు సంబంధించిన జీఓలను సవాలు చేస్తూ 2020లో హైకోర్టును ఆశ్రయించారు. ఇవన్నీ కూడా ఏపీ రవాణా సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌కు, దివ్యాంగుల చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం ఇటీవల విచారించింది. వైకల్యం కారణంగా వివక్ష చూపడానికి వీల్లేదని నాగేశ్వరయ్య తరఫు న్యాయవాది వాదించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో కొత్త జిల్లా.. సీఏం జగన్ మేథోమథనం!ఫ్లాట్‌ఫుట్ ఉంటే ఆ పోస్టుకు అనర్హులే..
దివ్యాంగుల చట్టం ప్రకారం ఫ్లాట్‌ఫుట్ వైకల్యం కాదని, అందువల్ల నాగేశ్వరయ్య ఆ చట్టం కింద రిజర్వేషన్ కోరలేరని ప్రభుత్వ, ఏపీపీఎస్సీ న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వ సర్వీసు రూల్స్ ప్రకారం ఏఎంవీఐ పోస్టుకు ఫ్లాట్‌ఫుట్ ఉన్న వ్యక్తి అనర్హుడని, అందువల్ల అతన్ని ఎంపిక చేయలేదన్నారు. ఏఎంవీఐ, మెటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ (పదోన్నతి ద్వారా), అసిస్టెంట్ మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్ (పదోన్నతి, ప్రత్యక్ష భర్తీ), ట్రాన్స్‌పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ (పదోన్నతి), ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ (ప్రత్యక్ష భర్తీ) పోస్టులకు దివ్యాంగుల రిజర్వేషన్‌ను మినహాయిస్తూ ప్రభుత్వం 2021లో జీఓ కూడా ఇచ్చిందని కోర్టుకు నివేదించారు. ఈ పోస్టులన్నింటికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరన్నారు. అందువల్ల ఈ పోస్టుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ కల్పించడం లేదన్నారు. వీటన్నింటి దృష్ట్యా పిటిషనర్ ఏఎంవీఐగా నియామకం కోరలేరని వారు కోర్టుకు విన్నవించారు.
ఇది కూడా చదవండి: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం.. భీమ్లానాయక్‌తో వచ్చిన డబ్బులు విరాళం!
రిజర్వేషన్‌ను మినహాయించొచ్చు
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ, ఏపీపీఎస్సీ న్యాయవాదుల వాదనలతో ఏకీభవిస్తూ తీర్పు వెలువరించింది. ఉద్యోగ స్వభావాన్ని బట్టి రిజర్వేషన్‌ను మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని, ఇదే విషయాన్ని దివ్యాంగుల చట్టం చెబుతోందని ధర్మాసనం పేర్కొంది. అంతేకాక.. ‘ఫ్లాట్ ఫుట్ కలిగి ఉన్న వ్యక్తి ఏఎంవీఐగా అనర్హుడని తేల్చడం చట్ట విరుద్ధమన్న పిటిషనర్ వాదన అర్ధరహితం. ఫ్లాట్‌ఫుట్ అనేది అంగవైకల్యం కానప్పటికీ, ఏఎంవీఐగా విధులు నిర్వర్తించేందుకు అది అడ్డంకి అవుతుంది. అది ఉన్న వ్యక్తికి నడిచేందుకు, పరిగెత్తేందుకు సరైన పట్టు ఉండదు. ఇది విధి నిర్వహణలో అతనికి ఇబ్బందవుతుంది. కాబట్టి పిటిషనర్, ఆ నిబంధనలను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరలేరు’ అని ధర్మాసనం తన తీర్పులో వెల్లడించింది. పాపం కష్టపడి జాబ్ సాధించి.. ఇలా కాలు వల్ల పోగొట్టుకున్నందుకు నాగేశ్వరయ్య తీవ్రంగా బాధపడుతున్నాడు. అతడి పరిస్థితి తెలిసిన వారు పాపం.. దురదృష్టం అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.