AP Inter Results 2023 Released: ఇంటర్ ఫలితాల విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. విద్యార్థుల కింద ఇవ్వబడిన లింకుల ద్వారా మీ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదుచూస్తున్న ఇంటర్ ఫలితాల రానే వచ్చాయి. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ఫస్టియర్, సెకండియర్ పరీక్ష ఫలితాలు ఒకేసారి విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడదల చేశారు. ఈ ఏడాది ఏపీలో మొత్తం 4.84 లక్షల మంది ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయగా.. వీరిలో 61 శాతం మంది ఉతీర్ణులయ్యారు. ఇక 5.19 లక్షల మంది ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరవ్వగా.. వీరిలో 72 శాతం మంది ఉతీర్ణులయ్యారు.
మొత్తంగా ఈ ఫలితాలలో బాలికలదే పైచేయి అని చెప్పాలి. ఫస్ట్ ఇయర్ లో 65 శాతం మంది బాలికలు ఉతీర్ణులు అవ్వగా, 58 శాతం బాలురు పాసయ్యారు. అలాగే సెకండ్ ఇయర్ లో 75 శాతం మంది బాలికలు పాసవ్వగా, 68 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. మే 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు మే 3వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫలితాల్లో అత్యధిక శాతం మంది కృష్ణా జిల్లా నుంచి ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స వెల్లడించారు.
రీకౌంటింగ్/ రీవెరిఫికేషన్ చేయించుకోవాలనుకునే విద్యార్థులు ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు రాయాలనుకున్న విద్యార్థులు మే 3వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
‘ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్’ 2022-2023 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,489 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించగా, మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షలు మార్చి 15న ప్రథమ సంవత్సరం, 16న ద్వితీయ సంవత్సరం ప్రారంభమై.. ఏప్రిల్ 3, 4 తేదీలలో ముగిశాయి. విద్యార్థుల కింద ఇవ్వబడిన లింక్స్ ద్వారా మీ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.