విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే.. బోర్డు నిర్వాహకులు అప్పుడప్పుడు చేసే నిర్వాకాల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంటారు. క్వచ్చన్ పేపర్ లీక్ కావడం.. తప్పులు దొల్లడం లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వెంటనే సర్ధబాటు చేసుకొని పరీక్షలు వాయిదా వేయడమో..మార్కులు కలపడమో లాంటివి చేస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్మీడియల్ పరీక్షల్లో భాగంగా మార్చి, సోమవారం 27 న సెకండీయర్ ఫిజిక్స్ పరీక్ష జరిగింది. ఈ క్రమంలో ఇంగ్లీష్ మీడియం పేపర్లో తప్పులు జరిగినట్లు ఇంటర్ బోర్డు గుర్తించింది. దీనిపై విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవొద్దని 2 మార్కులు కలుపుతున్నట్లు ప్రకటించింది. ఫిజిక్స్ – 2 లోని మూడో ప్రశ్నకు సమాధానం రాసినా.. రాయకపోయినా 2 మార్కులు కలుపుతామని ఇంటర్ బోర్డు వెల్లడించింది.
అసలు జరిగిన విషయం ఏంటంటే.. తెలుగు మీడియం ప్రశ్నా ప్రత్ంలో మూడో ప్రశ్నగా అయస్కాంత అవపాతము ను నిర్వచించుము? అని వచ్చింది.. అయితే ఇంగ్లీష్ మాద్యమ ప్రశ్నా పత్రంలో డిఫైన్ మ్యాగ్నటిక్ డెక్లినేషన్ అని తప్పుగా ప్రచురితమైంది. వాస్తవానికి డిఫైన్ మ్యాగ్నటిక్ ఇన్ క్లినేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్ అని రావాల్సి ఉంది. ఈ విషయంపై స్టూడెంట్స్ చర్చించుకోవడంతో పరీక్ష పత్రంలో తప్పులు దొల్లినట్టు ఇంటర్ బోర్డ్ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పరీక్షలు రాసిన ప్రతి విద్యార్థికి 2 మార్కులు కలుపుతామని ప్రకటించింది. దీంతో విద్యార్థులు సంతోషంలో మునిగిపోయారు.
ఏపీలో ఈ నెల 16 నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15 నుంచి 25 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్, ఏప్రిల్ 30 నుంచి మే 10 వరకు నిర్వహంచనున్నారు. ప్రతిరోజూ రెండు విడుతలుగా నిర్వహించనున్నారు.. ఆదివారం కూడా ప్రాక్టికల్స్ ఉంటాయని అధికారులు తెలిపారు. ఇటీవల ఎగ్జామ్ పేపర్స్ లీకేజ్ జరుగుతున్న నేపథ్యంలో పకడ్భందీగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.