పిల్లలకు మనమిచ్చే అతి విలువైన ఆస్తి చదువు అంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా.. గవర్నమెంట్ స్కూల్‌లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు అంటూ విమర్శలు చేశాయి. కట్ చేస్తే.. ఏడాది కాలంలోనే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంగ్లీష్‌లో అది కూడా అమెరికన్ యాక్సెంట్‌లో అదరగొడుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఇంగ్లీష్ ప్రావిణ్యాన్ని అమెరికన్ కాన్సెలేట్ సైతం మెచ్చుకుంది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రముఖ వ్యక్తి సీఎం జగన్ ప్రయత్నాన్ని ప్రశంసించాడు. ఆ వివారలు.
ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ఏపీలో పర్యటించారు. సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. ఏపీ పదో తరగతి ఇంగ్లీష్ పాఠ్యాంశాల్లో తన జీవితాన్ని పాఠంగా చేర్చడంపై సంతోషం వ్యక్తం చేశారు. అలానే నిక్ వుజిసిక్.. ఏపీలో పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. నిక్ వుజిసిక్ ముందు ఇంగ్లీష్ మాట్లాడి అదరగొట్టారు. మారుమూల ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు.. ఇంత చక్కని ఇంగ్లీష్‌లో మాట్లాడటం చూసి నిక్ వుజిసిక్ ఆశ్చర్యపోయారు. జగన్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ.. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తుందని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.