సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు సీఎం జగన్. నేడు వారి ఖాతాలో 10 వేల రూపాయలు జమ చేయనున్నారు సీఎం జగన్. ఆ వివరాలు..
సంక్షేమ పథకాలతో.. రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన నవరత్నాల హమీలను నెరవేర్చడమే కాక.. ఆ తర్వాత కూడా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అమ్మ ఒడి, వైఎస్సార్ భరోసా, నాడు-నేడు వంటి కార్యక్రమాలతో ప్రజల అభివృద్ది కోసం కృషి చేస్తున్నారు. సంక్షేమ పథకాల ద్వారా అందించే నగదును నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తూ.. వారు ఆర్థిక తోడ్పాటు అందితస్తోన్నారు. దీనిలో భాగాంగానే నేడు వారి ఖాతాలో 10 వేల రూపాయలు జమ చేయనున్నారు సీఎం జగన్. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వరుసగా ఐదో ఏడాది వైఎస్సార్ మత్స్యకార భరోసా ఆర్థిక భరోసా సాయాన్ని నేడు అందిస్తోంది. నేడు బాపట్ల జిల్లా నిజాంపట్నంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో రూ.10 వేలు జమ చేయనుంది. ఈ ఏడాది 1,23,519 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.123.52 కోట్లు జమ చేయనున్నారు. సముద్రంలో వేటపై నిషేధం ఉండటంతో.. జగన్ సర్కార్ మత్స్యకారులకు ఆర్థిక సాయం అందిస్తోంది.
మత్స్యకార భరోసాతో పాటూ ఓఎన్‌జీసీ పైపులైన్ ఏర్పాటుతో జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది మత్స్యకారులకు కూడా రూ.108 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు విడుదల చేయనున్నారు. సీఎం జగన్ నేడు బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మత్స్యకార భరోసా మొత్తాన్ని ఉ.11.35 గంటలకు బటన్‌నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తారు. అనంతరం లబ్ధిదారులతోనూ మాట్లాడతారు.
మత్యకార భరోసా కింద రూ.10 వేలు ఇవ్వడమే కాక.. ఆయిల్ సబ్సిడీని రూ.9కి పెంచారు. మత్స్యకారులకు స్మార్ట్ కార్డులు ఇచ్చారు. వీటి ద్వారా సబ్సిడీ మొత్తాన్ని మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని డీజిల్‌కు చెల్లించే వెసులుబాటు కల్పించారు. ఇలా ఏటా సగటున 20 వేల బోట్లకు గాను ప్రభుత్వం రూ.25 కోట్లు చెల్లిస్తోంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 26 ఆక్వా హబ్‌లు.. వాటికి అనుసంధానంగా 4,000 రిటైల్ షాపుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. మత్స్య, ఆక్వా రైతులకు సేవలు అందించేందుకు వీలుగా వెబ్ అప్లికేషన్ ఈ–మత్స్యకార్‌తోపాటు టోల్ ఫ్రీ నెంబర్ 155251ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.