ప్రజాసంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోన్న ఏపీ ప్రభుత్వం తాజాగా మరో శుభవార్త చెప్పింది. మే నుంచి ఇది అమల్లోకి రానుంది. ఆ వివారలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి.. ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఇక తాజాగా ప్రజారోగ్యం కోసం ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ సర్కార్ రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త చెప్పింది. ప్రజారోగ్యం కోసం ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుంది. ఇక మే 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఇంతకు ఆ శుభవార్త ఏంటి అంటే..
మే 1 నుంచి రాష్ట్రంలోని రేషన్‌కార్డ్ హోల్డర్స్‌కి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చిరుధాన్యాలు అందించేందుకు చర్యలు చేపట్టింది. మే 1 నుంచి రాయలసీమ జిల్లాల్లో జొన్నలు, రాగులు పంపిణీ చేయనున్నారు. పీడీఎస్ ద్వారా పేదలకు కూడా పౌష్టికాహార ఉత్పత్తులను అందించాలన్న లక్ష్యంతో జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి జొన్న ఉత్పత్తులను సేకరించగా.. కర్ణాటక ప్రభుత్వం నుంచి ఎఫ్‌సీఐ ద్వారా రాగులు కొనుగోలు చేస్తున్నారు అధికారులు. అంతేకాక ఆ పంట ఉత్పత్తులను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేస్తోంది ఏపీ సర్కార్. అలాగే రైతులు కూడా వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు పండించేలా అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.
ముందుగా రాయలసీమ జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా రాగులు, జొన్నల పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ విజయవంతమైతే రాష్ట్రమంతటా చిరు ధాన్యాల పంపిణీని అమలు చేయనున్నారు. కేంద్రం కూడా చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సాహించేందుకు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అలానే ఐక్యరాజ్య సమితి కూడా.. 2023ను చిరుధాన్యాల ఏడాదిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజారోగ్యం పెండచం కోసం ప్రభుత్వాలు చిరుధాన్యాల వినియోగాన్ని పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగాంగానే బియ్యం కంటే రాగులు, జొన్నలు పౌష్టికాహరంగా భావిస్తోంది ప్రభుత్వం. అలానే చిరుధాన్యాల కొనుగోలుకు అయ్యే ఖర్చే కూడా చాలా తక్కువ. అందుకే ప్రభుత్వం చిరు ధాన్యాలను పంపిణీ చేయబోతోంది. అంతేకాక వీటిని నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా.. వారికి మద్దతు ధర దక్కుతుందని భావిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటికే పీడీఎస్ ద్వారా గోధుమ పిండిని కిలో రూ.16 చొప్పున కార్డుకు గరిష్టంగా రెండు కిలోలు సరఫరా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే గోధుమ పిండిని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు వినియోగదారుల నుంచి ఐవీఆర్‌ఎస్ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. ఇక్కడ ప్రతినెలా ఇచ్చే రేషన్‌లో కేజీ బియ్యం బదులు ఉచితంగా గోధుమ పిండి ఇచ్చేలా పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేషన్ కార్డు మీద గోధుమ పిండి పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలో బయట మార్కెట్లో కిలో గోధుమ పిండి రూ.40 ఉంటే.. ప్రభుత్వం మాత్రం రేషన్‌కార్డు హోల్డర్స్‌కి కేవలం రూ.16కే అందిస్తోంది. అలానే ప్రభుత్వం సబ్సిడీపై కిలో కందిపప్పును రూ.67కే అందిస్తోంది. ఇలా ఏపీ ప్రభుత్వం పీడీఎస్ ద్వారా ప్రజలకు పౌష్టికాహరం అందిచాలని తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.