సంక్షేమ పథకాల అమల్లో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇక తాజాగా మరో సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమం కోసం పాటు పడుతున్నారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందాలని.. ఆర్థికంగా పైకి రావాలనే తపనతో.. వారి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చారు. నవ రత్నాల పేరుతో అనేక పథకాలను అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను మాత్రమే కాక.. తన దృష్టికి వచ్చిన సమస్యలపై స్పందిస్తూ.. ఆ దిశగా చర్యలు తీసుకుంటూ.. అన్ని వర్గాల వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఏపీలో అమలు చేస్తోన్న పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా నాడు-నేడు, అమ్మ ఒడి వంటి పథకాలను మిగతా రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఇక తాజాగా మరో వర్గం వారి కోసం జగన్ సర్కార్ వినూత్న కార్యక్రమాన్ని తీసుకువచ్చే ప్రయత్నంలో ఉంది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రభుత్వం వారికి మేలు చేసేందుకు ట్రాన్స్‌జెండర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ట్రాన్స్‌జెండర్లకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తోంది ప్రభుత్వం. ఇక తాజాగా వారి కోసం ప్రత్యేకంగా మరికొన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంది. ట్రాన్స్‌జెండర్లకు సరైన విద్య, వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అంతేకాక ట్రాన్స్‌జెండర్లు నివసించే ప్రాంతాల్లో వారికి మంచినీరు, పారిశుద్య కార్యక్రమాలు అమలు చేస్తోంది.
ఇక త్వరలోనే రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేయనుంది జగన్ సర్కారు. వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఆర్థిక సహాయాలు అందిస్తోంది.ఇక రాబోయే రోజుల్లో కూడా వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి వారు సాధికారత సాధించేలా తోడ్పాటు అందించనున్నారు. ట్రాన్స్‌జెండర్లకు సామాజిక భద్రత కల్పించేలా ఈ పాలసీ అమలు చేస్తోంది ప్రభుత్వం. ట్రాన్స్‌జెండర్స్ హక్కులను కాపాడటంతో పాటు వారి సంక్షేమానికి, అభివృద్ధికి కోసం ప్రభుత్వం ఈ ఏడాది అనగా 2022–23 బడ్జెట్‌లో ప్రత్యేకంగా రూ.2 కోట్లు కేటాయించింది.
ఇక ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ట్రాన్స్ జెండర్లకు వైఎస్ఆర్ పింఛన్ కానుక అందుతోంది. అలాగే హిజ్రాలకు గుర్తింపు కార్డులు అందజేశారు. పలువురికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ట్రాన్స్ జెండర్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో కూడా లబ్దిపొందుతున్నారు. అలాగే పలువురికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించారు. మరికొందరికి కూడా స్వయం ఉపాధి కల్పించినట్లు చెబుతున్నారు. మరి ట్రాన్స్‌జెండర్ల కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.