ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలానే ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ వివరాలు..
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అనేక సంక్షేమ పథకాలు తీసుకోచ్చారు. కేవలం ప్రజల గురించి మాత్రమే కాక.. ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల మేలు కోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం జగన్. ఇక కొన్ని రోజుల క్రితమే కాంట్రాక్ట్ ఉద్యోగుల పదవి కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ.. నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వారికి మేలు కలిగేలా వైద్య ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది.. అంటే..
ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌లోకి అదనంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలని శాశ్వతంగా చేరుస్తూ ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వీటిని ప్రతీ ఏటా రెన్యువల్ చేయాల్సిన అవసరం లేకుండా శాశ్వతంగా 46 రకాల క్యాన్సర్ చికిత్సలు హెల్త్ స్కీమ్‌లో చేర్చారు. సర్జికల్ ఆంకాలజీలో పది, మెడికల్ ఆంకాలజీలో 32, రేడియేషన్ ఆంకాలజీలో 4 క్యాన్సర్ రకాలని ఉద్యోగుల హెల్త్ స్కీంలో శాశ్వతంగా చేర్చింది వైద్య శాఖ. ఈ సదుపాయం రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పదవీ విరమణ చెందిన ఉద్యోగులకి కూడా వర్తిస్తుందని తెలిపారు. అంతేకాక అన్ని అనుబంధ ఆసుపత్రులలో కొత్తగా చేర్చిన ఈ 46 చికిత్సలు అందేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోను ఆదేశించారు. జగన్ సర్కార్ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
జగన్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఉద్యోగుల ఆరోగ్య చికిత్సలకు అవసరమయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే ఆస్పత్రులకు సమకూరుస్తుంది. ఎవరైనా ఉద్యోగులు అనారోగ్యంతో ఆస్పత్రుల్లో చేరాల్సి వస్తే ఈ పథకం ద్వారా వారికి ఉచితంగా అనుబంధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తారు. ఉద్యోగులకు వైద్యం అందించేందుకు వీలుగా ఈ స్కీమ్‌లో ఎప్పటికప్పుడు వివిధ రకాల చికిత్సలను అప్‌డేట్ చేయాల్సి వచ్చేది. తాజాగా ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు మరికొంత ఊరట లభించిందనే చెప్పాలి. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.