ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. వివిధ పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభివృద్థికి కృషి చేస్తున్నారు. తాజాగా ఆ కుటుంబాలకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. వివిధ పథకాలతో అన్ని వర్గాల ప్రజల అభివృద్థికి కృషి చేస్తున్నారు. ఒకవైపు సంక్షేమం, మరొకవైపు రాష్ట్రాభివృద్ధిని సమాతరంగా తీసుకెళ్తున్నారు. తరచూ వివిధ వర్గల ప్రజలకు, రైతులకు సీఎం జగన్ శుభవార్తలు చెప్తుంటారు. తాజాగా వర్కింగ్ జర్నలిస్టులకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వర్కింగ్ జర్నలిస్టు ఆరోగ్య పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి పెద్ద పీట వేస్తుంది. అలానే ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ద చూపిస్తుంది. అలానే సీఎం జగన్ తరచూ శుభవార్తలు చెప్తుంటారు. తాజాగా జర్నలిస్ట్ లకు గుడ్ న్యూస్ చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వర్కింగ్ జర్నలిస్టు ఆరోగ్య పథకాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 48ను జారీ చేసేంది. ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
కొత్త అక్రిడిటేషన్‌కు సంబంధించి గత నెల 31న జీవో నంబర్ 38 జారీ చేశామని ఆయన గుర్తు చేశారు. వర్కింగ్ జర్నలిస్ట్ ఆరోగ్య పథకంలో ప్రీమియం మొత్తం రూ.2,500. ఇందులో జర్నిలిస్టులు రూ.1250 చెల్లిస్తుంటే.. ప్రభుత్వం అంతే మొత్తంలో చెల్లిస్తుంది. జర్నలిస్టుల కుటుంబాల్లోని భార్య, పిల్లలు, తల్లిదండ్రుకు వర్తిస్తుంది. అలానే సర్కార్ కార్పస్ ఫండ్ నిర్వహిస్తూ జర్నలిస్టులకు అందించిన వైద్య సేవలకు సంబంధించి ఖర్చుల్ని తిరిగి చెల్లిస్తుంది. ఆరోగ్య శ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ఈ రీయింబర్స్ సంగతి చూస్తుంది. ఈ పథంకంలో అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ.2 లక్షల వరకు వైద్యసేవలు అందుతాయి.
ఇలా ఏడాదిలో పరిమితులు లేకుండా వైద్య సదుపాయం ఉంటుంది. రాష్ట్రంలో కొత్తగా అక్రిడిటేషన్ కార్డును పొందిన వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ ఆరోగ్య పథకం కింద ప్రీమియం రూ.1,250/ చెల్లించాలి. జర్నలిస్టులు సంబంధిత ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా డబ్బులు చెల్లించాలని అధికారులు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగించుకోవాలని ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కోరారు. మరి.. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.