కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల అభివృద్ధి కోసం అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. అలానే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక రకాల నిర్ణయాలను కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రజా సంక్షేమమే పరమావధిగా తన పాలనను కొనసాగిస్తున్నారు. పేద, బడుగు, బలహీన వర్గలా ప్రజల కోసం వివిధ రకాల పథకాలను ప్రారంభించారు. ప్రజలకు అవసరమైన అన్నింటిని పథకాల్లో సమకూర్చి నేరుగా వారికే అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా రైతన్నల కోసం అనేక రకాల పథకాలను సీఎం జగన్ అమలులోకి తీసుకువచ్చారు. తరచూ రైతులకు సంబంధించి.. ఏదో ఒక శుభవార్తను జగన్ సర్కార్ చెప్పేది. తాజాగా ఏపీ రైతులకు జగన్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఏపీ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అలానే రైతుల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. వైఎస్సార్ రైతు భరోసా పథకంతో రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. అలానే పంట నష్టం జరిగినప్పుడు రైతులను జగన్ ప్రభుత్వం ఆదుకుంటుంది. అంతేకాక రైతులకు అనేక సదుపాయాలు కలిపిస్తూ.. వారి అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కృషి చేస్తుంది. అంతేకాక తరచూ వ్యవసాయదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్తుంది. అలానే తాజాగా రైతులకు ఒక శుభవార్తను జగన్ ప్రభుత్వం అందించింది. రబీ సీజన్ లో తీసిన వరి పంటను కొనుగోలు చేయడానికి తగిన ఏర్పాట్లను చేస్తోంది.
ఈ విషయం గురించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. వారంలో ధాన్యం సేకరణ ప్రారంభం అవుతందని, మిల్లర్లకు అవసరమైన గోతాలనుసరఫరా చేస్తామన్నారు. ఖరీఫ్ అనుభవాల దృష్ట్యా రబీలో అప్రమత్తంగా ఉండాలని.. కనీస మద్దతు ధర లభించలేదనే ఫిర్యాదు ఏ రైతు నుంచి రాకూడదని మంత్రి అన్నారు. బియ్యం దారి మళ్లింపు, ధాన్యం సేకరణలో మిల్లర్ల జోక్యాన్ని సహించమని మంత్రి హెచ్చరించారు. మరి.. తాజాగా రైతుల విషయంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.