రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంగళవారం పౌర సరఫరా అధికారుల ప్రాంతియ సదస్సులో పాల్గొన్న మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రేషన్ కార్డు దారులకు ఓ ప్రకటన చేశారు.
రేషన్ కార్డు ఉన్న వారికి జగన్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ మంత్రి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మంగళవారం విజయనగరంలో జరిగిన పౌర సరఫరాల అధికారుల ప్రాంతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు దారులకు శుభవార్తను అందించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటనతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు రేషన్ కార్డు కలిగిన వారికి ప్రభుత్వం చెప్పిన ఆ గుడ్ న్యూస్ ఏంటంటే?
ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. పౌర సరఫరాల ప్రాంతీయ సదస్సులో మంత్రితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు రేషన్ కార్డు దారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. పట్టణాల్లో రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఫోర్టిఫైడ్ గోధుమ పిండి సరఫార చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, ప్రజలకు అందించే కిలో గోధుమ పిండి కేవలం రూ.16 లకే అందిస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఈ మేరకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ప్రకటనతో రేషన్ కార్డు దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.