రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ప్రభుత్వం రైతులకు అందించిన ఆ శుభవార్త ఏంటంటే?
ఖరీఫ్ సీజన్ మొదలవ్వడంతో రైతుల ముఖంలో సంతోషం వెల్లువిరుస్తోంది. ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు కోరుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ మొదలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఇప్పటికే పొలాలను చదును చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం రైతులకు ఓ శుభవార్త తెలిపింది. ఈ వార్తతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ఏపీ సర్కార్ అందించిన ఆ శుభవార్త ఏంటంటే?
ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఖరీఫ్ సీజన్ మొదలవడంతో ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తాజాగా తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో 10 లక్షల టన్నుల ఎరువులను రైతు భరోసా కేంద్రాలకు తరలించినట్లుగా తెలిపారు. రాష్ట్రానికి 5 లక్షల టన్నుల విత్తనాలు అవసరం కాగా, 4 లక్షల టన్నుల విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు వివరించారు. ఇందులో భాగంగానే కోస్తాంద్రకు వరి, రాయలసీమకు వేరుశనగా విత్తనాలు సిద్దంగా ఉంచామని స్పష్టం చేశారు. ఒకవేళ వర్షాలు గనుక సరిగ్గా కురవకపోతే.., ఉలవలు, చిరుదాన్యలు వంటివి కూడా సిద్దం చేసేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.