నటసింహం నందమూరి బాలకృష్ణకు ఏపీ సర్కారు షాకిచ్చింది. ఆయన డిమాండ్ చేసిన హిందూపురం రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయకపోవడమే కాకుండా.. ఆయన పీఏ డిప్యూటేషన్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయాన్ని పక్కన పెడితే పీఏ డిప్యూటేషన్ రద్దుకు కారణం లేకపోలేదు. ఇటీవల కర్ణాటక సరిహద్దులో పేకాడుతూ పట్టుబడిన వారిలో బాలకృష్ణ పీఏ బాలాజీ కూడా ఒకరు. ప్రస్తుతం ఈ వ్యవహారంతో బాలయ్యకు తలనొప్పి తప్పేలా లేదు. అటు సినిమాలు చేస్తూనే ఇటు నియోజకవర్గంపై దృష్టి సారిస్తూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. కానీ, పీఏల విషయంలో మాత్రం ఇబ్బందులు తప్పడంలేదు.
ఇదీ చదవండి: అప్పుడు సీఎం జగన్‌ను తిట్టుకున్నా.. వాళ్లు ఎవర్నీ లెక్క చేయరనుకున్నా: పేర్ని నాని
సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయిన బాలాజీని బాలకృష్ణ రిక్వెస్ట్ చేసి పీఏగా నియమించుకున్నాడు. ఆ తర్వాత బాలయ్యలేని సమయంలో నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా చూసుకోవడం, కార్యకర్తలతో మాట్లాడటం బాలాజీనే చూసుకునేవాడు. అంతలా నమ్మిన బాలాజీ తీరు ఇలా ఉండటం అటు బాలకృష్ణను కూడా అసంతృప్తికి గురిచేసినట్లు తెలుస్తోంది. బాలాజీ డిప్యూటేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో బాలాజీ ఒక ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి.. తిరిగి టీచర్ గా విధులు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. బాలాజీ విషయంలో బాలకృష్ణ అయితే స్పందించలేదు. మరి కొత్త పీఏగా ఎవరిని నియమించుకుంటారనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది. పీఏల విషయంలో బాలకృష్ణ ప్రతిసారి మోసపోతున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.