ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు. ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్యనందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పలు సందర్భాల్లో అన్న విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఎన్నో వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ఏపిలో విద్యార్థుల కోసం ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వస్తున్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, మన బడి-నాడు నేడు ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తూ.. విద్యారంగంలో సమూల మార్పులకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలనిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఏపి సర్కార్ విద్యా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో పనులు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలనిచ్చింది. విద్యార్థులు సెలవుల్లో ఏం చేయాలో.. ప్రవేశాల నిర్వహణలాంటి పనులు చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. మే 1 నుంచి సెలవులు కేవలం విద్యార్థులకే.. ఉపాధ్యాయులకు కాదని తేలిపోయింది. అయితే ఉపాధ్యాయులు పాఠశాలకు రావాలా.. వద్దా అనేదానిపై స్పష్టత ఇవ్వకుండానే వివిధ రకాల పనులు అప్పగించింది. 3, 4, 5 తరగతులకు వర్క్‌షీట్లు అందించడంతో పాటు గా “మేము చదవడాన్ని ఇష్టపడతాం” జగనన్న విద్యాకానుక కిట్ల సరఫరా, పదో తరగతి ఫలితాల తర్వాత టీసీల జారీ, పీఎం శ్రీ పాఠశాలల కాస్టింగ్ షీట్ రూపకల్పన చేయడంతో పాటు నాడు-నేడు పనులు.. విద్యార్థులు గ్రంథాలయాలకు వెళ్లేలా చూడటం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి ప్రిపరేష్ అయ్యేలా చేయడం లాంటి పనులు అప్పగించింది.
ఈ క్రమంలో ఉపాధ్యాయులు తప్పని సరిగా పాఠశాలకు వెళ్లాలి.. నిర్మాణ పనులను పర్యవేక్షించడంతో పాటు నాణ్యతను కూడా పరిశీలించాలి. ఈ కార్యక్రమాల వల్ల నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఒకవేళ ప్రధానోపాధ్యాయుడు సెలవు పెడితే సమీపంలోని మరో ఉపాధ్యాయుడిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవుల్లో ప్రతి పాఠశాలల్లో 23 రకాల కార్యకలాపాలు నిర్వర్తించాల్సి ఉంటుందిని ఆదేశాలనిచ్చారు. “మేము చదవడాన్ని ఇష్టపడతాం” కార్యక్రమాన్ని మే ఒకటో తేదీ నుంచి జూన్ పదో తేదీ వరకు నిర్వహించాలని.. విద్యార్థులను బృందాలుగా విభజించి.. వారిని ఉపాధ్యాయులు దత్తత తీసుకోవాలని తెలిపాంది.
అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి ప్రతిరోజూ కథలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని.. ఆ కథలు చదివాక విద్యార్థుల అభిప్రాయలను సేకరించాలని.. అలాగే విద్యార్థుల సామర్థ్యం బట్టి ఒక్కొక్కరికి ఐదు నుంచి పది ఇవ్వాలి. ఇచ్చిన పుస్తకాలను విద్యార్థి చదివేస్తే స్నేహితుల వద్దనున్న పుస్తకాలతో మార్చుకునేలా చూడాల్సిన బాధ్యత ఉపాద్యాయులు తీసుకోవాలిని.. గ్రామాల్లోని ప్రజా గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలను తెచ్చుకునేలా పిల్లలకు అవగాహన కల్పించాలి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలనిచ్చింది. మొత్తానికి వేసవి కాలం సెలవుల్లో ప్రతి పాఠశాలలో 23 రకాల కార్యకలాపాలను నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.