ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొండి పట్టుదలకు కేరాఫ్ అడ్రస్‌లాంటి వారు. ఆయన ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టరు. ఇప్పుడు ఏపీకి పెట్టుబడుల విషయంలో కూడా అదే జరిగింది. ఒక్క రోజులో లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా శుక్రవారం ‘ఏపీ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్ 2023’ ప్రారంభించింది. వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆదివారంతో ఈ కార్యక్రమం ముగియనుంది. ఇక, సమ్మిట్‌లో దేశ వ్యాప్తంగా ఉన్న పలు పెద్ద పెద్ద సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ వ్యాపార వేత్త ముఖేష్ అంబానీ, సంజీవ్ బజాజ్, నవీన్ జిందాల్, జీఎంరావు, జీఎంఆర్, ప్రీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించారు. నిన్న ఒక్కరోజే ఏపీకి 11 లక్షల కోట్ల పెట్టుబడుల వర్షం కురిసింది. దాదాపు 6 లక్షల ఉద్యోగాల ప్రకటన జరిగింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, ప్రజల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉద్యోగాల కల్పన, ఏపీకి పెట్టుబడులు తీసుకురావటంలో విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని ఓ ప్రధాన అస్త్రంగా మార్చుకుని విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. అయితే, సీఎం జగన్ చేపట్టిన ఈ సమ్మిట్‌తో ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అయింది. నాలుగేళ్ల పాటు ఆ విమర్శలను మౌనంగా భరించిన ఆయన ఒక్క రోజులో సమాధానం చెప్పారు. తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. సీఎం జగన్ అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన మొండితనం. ఏ విషయంలోనైనా చాలా మొండిగా ఉంటారు.
ఓ విషయంపైన ఆయన దృష్టి సారిస్తే దాన్ని సాధించే వరకు వెనక్కు తగ్గరు. ఇప్పుడు ఏపీకి పెట్టుబడుల విషయంలోనూ అదే జరిగింది. ఏపీకి పెట్టుబడులు రావటం లేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సరైన విధంగా సమాధానం చెప్పారు. సౌత్‌లో ఎవ్వరికీ సాధ్యంకాని పని చేసి చూపించారు. సాధారణంగా ముఖేష్ అంబానీ సౌత్‌లో జరిగే ఏ ఇన్‌వెస్ట్‌మెంట్ సమ్మిట్‌కు హాజరుకారు. అలాంటిది నిన్న ఏపీలో జరిగిన ఈ సమ్మిట్‌కు వచ్చారు. తమ సంస్థ తరపున పెట్టుబడులు ప్రకటించారు. వీరే కాదు.. వచ్చిన ప్రతీ కంపెనీ వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించింది.
ఏ ఇతర రాష్ట్రానికి సాధ్యంకాని పనిని ఏపీ చేసి చూపించింది. పక్క రాష్ట్రం తెలంగాణలో చాలా సార్లు ఇన్‌వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లు జరిగినా ఇంతలా సక్సెస్ కాలేదు. కానీ, ఏపీలో జరిగిన సమ్మిట్ మాత్రం సూపర్ హిట్ అయింది. మొదటి రోజే 11 లక్షల కోట్ల పెట్టుబడులను సాధించింది. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామర్థ్యమే అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలా ఫోన్‌ల ద్వారా వ్యాపార దిగ్గజాలను సమ్మిట్‌కు రప్పించటం ఎవ్వరికీ సాధ్యం కాలేదు. నాడు ప్రజా సంకల్ప యాత్ర సమయంలోనూ జగన్ ఇదే పట్టుదలను చూపించారు. భారీ మెజార్టీతో గెలిచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే పట్టుదలతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ కురిపించారు.