తూర్పు గోదావరి జిల్లాలో యువతి మిస్సింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. స్నేహితురాలిని కలిసేందుకు ఆటో ఎక్కిన యువతి.. ఆటో డ్రైవర్ తేడాగా ఉన్నాడని చెప్పడం, చెప్పిన టైమ్‌కు స్నేహితురాలిని కలవకపోవడంతో.. సదరు యువతి స్నేహితురాలు.. తామిద్దరి మధ్య జరిగిన చాటింగ్ స్క్రీన్ షాట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసి సాయం చేయాల్సిందిగా తూర్పు గోదావరి జిల్లా పోలీసులను అభ్యర్థించింది. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే దాన్ని పరిష్కరించారు. జరిగిన సంఘటనలో సదరు ఆటో డ్రైవర్ తప్పు ఏం లేదని తేల్చారు. యువతి అబద్ధం ఆడినట్లు తెలిపారు.
తూర్పు గోదావరి ఎస్పీ ఈ కేసు వివరాలు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం యువతి తవ్వ హారిక అదృశ్యమైన కేసు విషయంలో జిల్లా ఎస్పీ M.రవీంద్ర బాబు IPS, నిరంతర పర్యవేక్షణలో నిన్న సాయంత్రం నుండి ఈరోజు ఉదయం వరకు పోలీసులు చేపట్టిన దర్యాప్తులో సాంకేతికంగా, సీసీ ఫుటేజీలను సంక్షిప్తంగా విశ్లేషణ చేసి కొంత పురోగతి సాధించడం జరిగింది. సీసీ కెమెరాల ఫుటేజీలో సదరు యువతి హారిక ఆటోలో కాకినాడ కాంప్లెక్స్ వద్దకు చేరుకుని తనంతట తాను నడుచుకుంటూ వెళ్లడం గమనించడం జరిగిందని తెలిపారు.
హారిక తన స్నేహితురాలికి చిత్రాడలో ఉన్నానని ఆటో వాడు తేడాగా ఉన్నాడని మెసేజ్ పెట్టింది కానీ ఆ సమయానికి హారిక.. కాకినాడ టౌన్ లోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న సీసీ పుటేజ్ లభ్యమయ్యాయి కాబట్టి సదరు ఆటో డ్రైవర్ గురించి పెట్టిన మెసేజ్ లో నిజం లేదు అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
హారిక ఈ రోజు ఉదయం కూడా కొన్ని వాట్సాప్ గ్రూపులో నుండి లెఫ్ట్ అయ్యింది. ఆమె సిమ్ నంబర్ మాత్రం స్విచ్ ఆఫ్ లో ఉందని, హారిక ఆచూకీ గుర్తించడానికి ఆరు పోలీస్ బృందాలు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ముందుకు సాగడం జరుగుతుందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ప్రబలుతున్న కొన్ని వదంతులను నమ్మవద్దని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. గంటల వ్యవధిలోనే కేసులో పురోగతి సాధించిన పోలీసులను జనాలు ప్రశంసిస్తున్నారు. యువతి ఆచూకీ లభ్యం అయితే కేసు గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది అంటున్నారు అధికారులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: ఆటో డ్రైవర్ తేడాగా ఉన్నాడని ఫ్రెండ్‌కి మెసేజ్ చేసింది.. చివరకు!