ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. ఆయనను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గౌతమ్ సవాంగ్ కు ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. జీఏడీలో రిపోర్ట్ చేయాలంటూ ఉత్తర్వుల్లో తెలిపారు. సవాంగ్ స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది. ప్రస్తుతం రాజేంద్రనాథ్ రెడ్డి ఇంటిలిజెన్స్ డీజీగా ఉన్నారు.