ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖల కార్యదర్శులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. ‘ఏపీ ఈ గెజిట్’లోనే ప్రజలకు అవి అందుబాటులో ఉంటాయన్నారు. కాగా, జీవొ ఐఆర్ వెబ్ సైట్ ను నిలిపివేసినందున సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండేందుకుగానూ వివరాలను ఈ–గెజిట్ లో పొందుపరచనున్నట్టు చెప్పారు.
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో 2008 నుంచి జీవోలను ప్రత్యేక వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయటం ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం వరకూ ఇదే విధానం కొనసాగించారు. జీవోలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయటం నిలుపుదల దీని పైన పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాదర్శక పాలన పైన ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపైన న్యాయస్థానాల్లో పిటీషన్లు దాఖలయ్యాయి. దీంతో.. ప్రభుత్వం పునరాలోచన చేసింది. విమర్శల వెల్లువతో కాస్తంత దిగొచ్చినట్టుగా కనిపించినా.. తమకు అవసరమైన జీవోలను రహస్యంగానే ఉంచుతామంటూ తన నిజ స్వరూపాన్ని ప్రదర్శించుకుంది.
ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ఈ-గెజిట్ ద్వారా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే అవసరం లేని వ్యక్తిగత సమాచారం, తక్కువ ఖర్చులు, అధికారుల సెలవులు, రహస్య సమాచారాన్ని మాత్రం అందుబాటులో ఉంచబోమని స్పష్టం చేశారు. ఇకపై అన్ని జీవోలు అధీకృత అధికారి డిజిటల్ సంతకంతో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.