ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి సీఎం జగన్ బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. దీంతో పాటు విజయనగరం జిల్లాలోని మరో రెండు కీలక ప్రాజెక్టులతో పాటు విశాఖలోని రూ.21, 844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ ను సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రూ. 4,592 కోట్ల వ్యయంతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురంలో నిర్మించనున్నారు. అలానే రూ. 194.40 కోట్ల వ్యయంతో తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్, రూ. 23.73 కోట్ల వ్యయంతో చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌లను నిర్మించనున్నారు. వీటిని కూడా సీఎం జగన్ శంకుస్ధాపన చేశారు.
ఇక రూ. 4, 592 కోట్ల వ్యయంతో 2,203 ఎకరాల విస్తీర్ణంలో 36 నెలల్లో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయనున్నారు. విమానాశ్రయానికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోవడంతో భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించటానికి ప్రభుత్వం అన్ని సిద్ధం చేసింది. ఈ విమానాశ్రయ నిర్మాణ సమయంలో 5 వేల మందికి ఉపాది కలగనుంది. ఇక్కడ సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి, పర్యాటక అభివృద్ది, ఇతర పెట్టుబడుల ద్వారా మరో 5 లక్షల మంది ఉపాది పొందనున్నారు.
ఇక తారకరామ తీర్దం ప్రాజెక్ట్ పూరైతే.. ఆ సమీపంలో ఉండే 49 గ్రామాల ప్రజలకు త్రాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీరుతో పాటు భోగాపురం విమానాశ్రయానికు అవసరమైన నీరు అందనుంది. డిసెంబర్ 2024 నాటికి పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. విజయనగరం జిల్లాలోని వేలాదిమంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం కలిగించేలా చింతపల్లి సముద్ర తీరంలో రూ. 23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం చేయనున్నారు. ఈ నిర్మాణం వల్ల మత్స్యకారుల ఆదాయం పెరనుంది.
బుధవారం భోగాపురం ఎయిర్పోర్ట్ కు శంకుస్థాపన చేసిన అనంతరం.. విజయనగరం జిల్లా సవరవల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురం విమానశ్రయం నిర్మాణం పూర్తి అయితే ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మరనుందన్నారు. ఇదే సందర్భంగా ఈ సెప్టెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్ హబ్ గా మారనున్నారు. భోగాపురం ఎయిరోపోర్టును 2026లో మళ్లీ మీ బిడ్డే వచ్చి ప్రారంభిస్తాడని, విమానాశ్రయాన్ని తీసుకురావడానికి చిత్తశుద్ధితో పని చేశామన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తొచ్చేవి. కానీ, రాబోయే రోజుల్లో జాబ్ హబ్ గా మారుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మరి.. విజయనగరంలో బుధవారం సీఎం జగన్ చేసిన పర్యటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.