అన్నదాతల సంక్షేమం గురించి మాత్రమే కాక వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం వెంటనే చర్యలు తీసుకుంటారు సీఎం జగన్. ఇక తాజాగా ఆయన ఏళ్లుగా రైతులను ఇబ్బంది పెడుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోనున్నారు. ఆ వివరాలు..
పదలు ఏళ్లుగా వివాదాల్లో ఉన్న చుక్కల భూములు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అనేక సంవత్సరాలుగా.. రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. చుక్కల భూములపై సర్వ హక్కులు వారికే కల్పించేందుకు రెడీ అయ్యారు సీఎం జగన్. ఈ నిర్ణయం వల్ల సుమారు 20 వేల కోట్ల రూపాయల విలువ చేసే.. 2,06,171 ఎకరాల చుక్కల భూములకు సంబంధించిన సంపూర్ణ హక్కులను రైతలుకు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం జగన్. ఈ నిర్ణయం వల్ల సుమారు 97,471 రైతన్నల కుటుంబాలకు మేలు కలగనుంది. చుక్కల భూమలుపై రైతులకే సర్వ హక్కులు అందించే కార్యక్రమాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఈ కార్యక్రమం జరగనుంది.
బ్రిటిష్ కాలంలో సుమారు 100 సంవత్సరాల క్రితం భూ సర్వే జరిగినప్పుడు ‘ప్రభుత్వ భూమి’ లేదా ‘ప్రైవేటు భూమి‘ అని నిర్ధారణ చేయని కారణంగా.. రెవెన్యూ రికార్డుల్లో (రీ సెటిల్మెంట్ రిజిస్టర్ ఆర్‌ఎస్‌ఆర్) ఆ భూములకు సంబంధించిన పట్టాదారు గడిలో ‘చుక్కలు’ పెట్టి వదిలేశారు. కాలక్రమేణా ఆ భూములే ‘చుక్కల భూములు’గా ప్రాచుర్యం పొందాయి. దీని వల్ల ఆ భూమలుపై దశాబ్దాలుగా రైతులకు సంపూర్ణ హక్కులు లేక.. అటు ఆ భూములు అనుభవిస్తున్నా వాటిని అమ్ముకునే స్వేచ్ఛ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేస్తూ ప్రతి రైతన్న కుటుంబానికి మేలు చేయాలని నిర్ణయించారు. వారి ఆస్తిపై పూర్తి హక్కులు వారికే చెందాలని రెవెన్యూ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ రైతులు తిరిగే అవసరం లేకుండా, వారికి ఒక్క పైసా ఖర్చు లేకుండా సమస్య పరిష్కారం కావాలని చూశారు. దీనిలో భాగాంగానే నేడు సీఎం జగన్.. దశాబ్దాల కాలం నాటి ఈ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ.. వాటిపై రైతులకే సర్వ హక్కులు కల్పించనున్నారు.
సంవత్సరాల తరబడి తమ స్వాధీనంలో ఉన్న ఈ భూములను.. రైతులు ఏనాడు తమ సొంత అవసరాలకు అనగా.. క్రయవిక్రయాలు, రుణం, తనఖా, వారసత్వం, బహుమతి మొదలగు పరిస్థితులకు అనుగుణంగా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కానీ సీఎం జగన్ నిర్ణయం వల్ల రైతులు ఆ దుస్థితి నుంచి విముక్తి పొందడమే కాక.. వారి భూములకు వారిని పూర్తి హక్కుదారులు కానున్నారు. జగన్ నిర్ణయం వల్ల సుమారు 97,471 కుటుంబాలకు దాదాపు రూ. 20,000 కోట్ల మేర లబ్ధి చేకూర్చనుంది. అంతేకాక ఈ భూములపై రైతులకు సర్వ హక్కులు కల్పించేలా.. నిషేధిత భూముల జాబితా నుంచి ఈ 2,06,171 ఎకరాల భూమిని తొలగించారు. పేద ప్రజలకు మేలు చేస్తూ జగన్ ప్రభుత్వం రెవెన్యూ విభాగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పుగా చెబుతున్నారు అన్నదాతలు. మరి సీఎం జగన్ నిర్ణయంసై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.