సాధారణంగా చాలా మంది పొలిటీషియన్స్, సినీ సెలబ్రెటీలు, క్రీడా రంగానికి చెందిన వారు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు వాడుతుంటారు. కొంతమందికి మార్కెట్ లో కొత్తగా ఏ బ్రాండ్ వచ్చిన మొదట తామే సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. సెలబ్రెటీలు ధరించే ప్రతి కాస్ట్యూమ్, వాడే గాడ్జెట్స్ ఇంకా వాహనాలు అన్ని కూడా అంతర్జాతీయ స్థాయి బ్రాండ్స్ అయ్యి ఉంటాయి. ఇలాంటి వారిలో కొంత మంది రాజకీయ నేతలు కూడా వారు వాడే వస్తువులు చాలా గ్రాండ్ ఉంటాయి. తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ధరించిన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను వాడే దుస్తులు, వాచిల ఎంపికలో టేస్ట్ వినూత్నంగా చాలా సింపుల్ గా ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్లినా ఎంతో సింపుల్ గా తయారై వెళ్తుంటారు. తన తండ్రి వైఎస్సార్ లాగే జగన్ కూడా ఎంతో నిడారంబంరంగా.. ఎప్పుడూ తెల్లని బట్టలు ధరించడం.. లెదర్ స్ట్రాప్ ఉండే స్లిమ్ వాచ్ లనే వాడుతారని చెబుతుంటారు. ఈ వాచిపైన బ్రాండ్ పేరు స్పష్టంగా కనిపించకున్నా గూగుల్ లో సెర్చ్ చేయగా అది బ్రెగ్యుట్ వాచ్ (Breguet) అనిపిస్తోంది. కాకపోతే ఇది మోడల్ పోలికలు దగ్గరగా ఉండటాన్ని బట్టి చేసిన అంచనా మాత్రమే.
స్విస్ లో తయారయ్యే ఈ వాచిలకు ఎంతో ప్రత్యేకత ఉంది.. ఈ వాచిలు వందేళ్లయినా చెక్కు చెదరకుండా పనిచేస్తాయి. ఖరీదు రూ.9-11 లక్షల వరకుంటుంది. వీటి వరల్డ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఫ్రాన్స్ లో ఉంది. ఇక ఈ వాచ్ సీఎం జగన్ కి అక్కడే చదువుతున్న ఆయన కూతురు హర్షా బహుకరించి ఉంటుందా లేదా అన్నది ఎవరికీ తెలియదు. ఇంతకు అది బ్రెగ్యుట్ బ్రాండేనా కాదా అనేది సన్నిహితంగా ఉండే వాళ్లు చూసి చెబ్తే తప్ప ఒక నిర్ధారణకు రావడం కష్టం.
ఏది ఏమైనా సీఎం జగన్ అంటే అభిమానించే అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది ఉన్నారు. వారికి ఈ వాచ్ గురించి తెలిస్తే.. అమెరికా, యూరప్ దేశాల నుంచి భారీగా ఆర్డర్లు పెడతారు. ఆ బ్రాండ్ పాపులారిటీ ఎక్కటికో పోతుందని అంటున్నారు. బ్రెగ్యుట్- బ్రాండ్ వాచీలు ఇప్పుడు స్విట్జర్లాండ్‌లోని నోవెల్లే లెమానియా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.