ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది. విజయవాడలో నిర్వహించిన గురుపూజోత్సవం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సం విశిష్టత, మన జీవితాల్లో ఉపాధ్యాయులకు ఉన్న ప్రాధన్యతను సీఎం ఎంతో గొప్పగా వివరించారు. అంతేకాకుండా రాష్ట్రంలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటో వివరించారు. విద్యా వ్యవస్థ ఇలా ఉండాలంటూ ఆయన మనసులోని మాటలను వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. “సాన పెట్టకపోతే వజ్రం కూడా మామూలు రాయితో సమానంగా ఉంటుంది. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయగలిగేది ఉపాధ్యాయులే. విద్యార్థులను తీర్చిదిద్దే శక్తి ఒక్క ఉపాధ్యాయులకే ఉంటుంది. నాకు విద్య నేర్పించిన గురువులందరికీ రుణపడి ఉంటాను. ప్రభుత్వ పాఠశాలలను.. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. అందుకు తగిన సంస్కరణలు ప్రవేశపెడుతున్నాం. అలా చేయడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే పరిస్థితి వస్తుంది” అంటూ సీఎం జగన్ ఆకాంక్షించారు.
ఈ గురుపూజోత్సవం కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 176 మందిని సీఎం జగన్ సత్కరించారు. ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు పురస్కారాలు అందజేసి అభినందించారు. ఈ సత్కరించే క్రమంలో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. స్టేజ్‌పై సీఎం జగన్‌ను కలిసిన సమయంలో ఒకరి కళ్లజోడు జేబులోంచి కిందపడిపోయింది. అది గమనించి ఆయన దానిని తీసుకునేలోపే సీఎం జగన్ ఆ కళ్లజోడుని తీసి ఉపాధ్యాయుడికి అందజేశారు. అయితే చాలా మందికి ఈ ఘటన చూస్తే అందులో ఏముంది? అనే భావన కలగచ్చు. కానీ, ఒక స్టేట్ సీఎంగా ఉన్న వ్యక్తి ఒక ఉపాధ్యాయుడి కళ్లజోడు తీసి ఇవ్వడం అంటే అంత సాధరాణ విషయం కాదని.. సీఎం జగన్‌కు ఉపాధ్యాయులంటే ఎంత గౌరవమో.. ఈ ఒక్క ఫొటో చూసి చెప్పొచ్చంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The government of #AndhraPradesh has been giving top priority to education and has brought several reforms in the sector and spent Rs 53,000 crore during the last three years, said Chief Minister Y.S. Jagan Mohan Reddy (@ysjagan). pic.twitter.com/ODigm0a1GW
— IANS (@ians_india) September 5, 2022