రాయలసీమ రైతులకు ఏపీ సీఎం జగన్ భారీ ఆఫర్ ఇచ్చారు. జగన్ చెప్పినట్టు చేస్తే ఎకరానికి రూ. 30 వేలతో పాటు రైతు బిడ్డలకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద రామ్ కో సిమెంట్స్ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను నమ్మి ముందుకొస్తే ఎకరానికి రూ. 30 వేలు చొప్పున రైతులకు చెల్లిస్తామని అన్నారు. గ్రీన్ కో ప్రాజెక్టులను నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్న నేపథ్యంలో రైతుల నుంచి భూములు లీజుకి తీసుకోవాలని జగన్ నిర్ణయించారు. గ్రీన్ కో ప్రాజెక్ట్ లో భాగంగా ప్రభుత్వమే రైతుల నుంచి భూమిని లీజుకి తీసుకుని.. సౌర, పవన విద్యుత్ తయారీ సంస్థలకు ఇస్తుందని అన్నారు.
దీని కోసం ఎకరానికి రూ. 30 వేల చొప్పున లీజు చెల్లిస్తామని, ప్రతీ మూడేళ్లకొకసారి 5 శాతం లీజు పెంచుకుంటూ పోతామని అన్నారు. ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో స్థానికులకు, ముఖ్యంగా రైతు బిడ్డలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన వెల్లడించారు. 3 పారిశ్రామిక కారిడార్ల పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు కనీసం 2 వేల ఎకరాలు ఒక క్లస్టర్ గా ఉండాలని.. ఒకే చోట 500 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా భూములు సేకరించాలని అధికారులకు సూచించారు. ఈ ప్రతిపాదనకు రైతులు అంగీకరించేలా చేసి.. భూములను లీజుకు ఇచ్చేలా చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులదే అని ఆయన అన్నారు. గ్రీన్ కో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ ప్రాజెక్టులకు రైతులు సహకరించాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు.
ఏపీ సీఎం జగన్ తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటాయి. భవిష్యత్తులో కోల్పోయాం అన్న భావన లేకుండా ప్రజల కోసం ఆలోచిస్తారు. గ్రీన్ కో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులతో సోలార్ పవర్, వైండ్ పవర్ ని సృష్టించనున్నారు. దీని వల్ల వాతావరణం కూడా డిస్టర్బ్ అవ్వదు. మొన్నా మధ్య ప్లాస్టిక్ ఫ్లెక్సీలని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎకో ఫ్రెండ్లీ విద్యుత్ ని సృష్టించేలా గ్రీన్ కో ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇస్తున్నారు. అయితే దీని కోసం భారీగా సోలార్ ప్యానెల్స్ ను, వైండ్ మిల్స్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం భూములు కూడా కావాలి. అయితే అంత భూమిని సేకరించాలంటే రైతుల వల్లే అవుతుంది.
ఈ ప్లేస్ లో వేరే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కమిషన్ కోసం ఆ కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై రైతుల ముఖాన కొంత డబ్బు పడేసి భూములను కార్పొరేట్ హస్తగతం చేస్తారు. కానీ ఇక్కడున్నది జగన్.. రైతులే లాభపడాలి. భూమి అమ్ముకుంటే లాభం లేదు. అదే లీజుకి ఇస్తే భూమి ఎక్కడికి పోదు, అలానే కమర్షియల్ గా దాని మీద డబ్బులు వస్తాయి. పైగా మూడేళ్లకొకసారి లీజు 5 శాతం పెంచుతామంటే అంతకంటే బిజినెస్ డీల్ ఇంకెక్కడుంటుంది. ఒక రకంగా రాయలసీమ రైతులకు ఇదొక మంచి బిజినెస్ డీల్ అని చెప్పవచ్చు. తమ భూములు ఎక్కడికి పోవు. పైగా కొన్ని రోజుల తర్వాత ఉపాధి అవకాశాలు వస్తాయి. లీజు ఎలాగూ వస్తుంది. మొత్తానికి సీఎం జగన్ రాయలసీమ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.