ap cinema ticket prices : తెలుగు సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా టికెట్ల ధరల పెంపు జీవో అతి త్వరలో అమల్లోకి రానుందట. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల ధరలకు సంబంధించిన కొత్త జీవోను ఇవాళో, రేపో జారీ చేయనుందని సమాచారం. సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై టిక్కెట్ ధరల నిర్థారణ కమిటి వివిధ స్థాయిల్లో ఇప్పటికే చర్చించింది. జీవో 35తో పోల్చుకుంటే కొత్త జీవోలో చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ధరల నిర్థారణ జరిగినట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని థియేటర్లకు ఊరటనిచ్చేలా కొత్త ధరలు ఉండనున్నాయట.
కాగా, గత కొన్ని నెలలనుంచి ఏపీలో సినిమా టికెట్ల ధరలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమలోని కొంతమంది ప్రముఖులకు మధ్య గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో సినిమా టికెట్ల ధరలు పెంచాలంటూ చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, ఆర్ నారాయణ మూర్తితో పాటు మరికొంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. వీలైనంత త్వరగా జీవో జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. సినిమా టికెట్ల ధరల పెంపుకు సంబంధించి త్వరలో అమలు కానున్న కొత్త జీవోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.