ap cinema ticket prices : తెలుగు చలన చిత్ర పరిశ్రమ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న సినిమా టికెట్ల ధరల పెంపు జీవో అమల్లోకి వచ్చింది. సినిమా టెకెట్ల ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిన్న(సోమవారం) సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జీవో జారీ చేయటంతో పాత జీవో నెంబర్ 35 రద్దు అయిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త జీవోలో కనిష్ట టికెట్ ధర 20రూపాయలు కాగా, గరిష్ట టికెట్ ధర 250 రూపాయలుగా ఉంది. ప్రాంతాన్ని బట్టి సినిమా టికెట్ ధరను నిర్ణయించింది ప్రభుత్వం. హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ పరిగణలోకి రాకుండా ఉండి.. 100 కోట్ల రూపాయల బడ్జెట్ దాటిన సినిమాలు కనీసం 10 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించింది. 20 శాతం షూటింగ్ ఏపీలో జరుపుకున్న సినిమాలకు మాత్రమే ఈ టికెట్ ధరల పెంపు వర్తిస్తుందని పేర్కొంది. చిన్న సినిమాలకు ఐదు షోలు వేసుకునే అవకాశం కల్పించింది. కొత్త జీవో జారీపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఓ ట్వీట్ చేశారు.
పెరిగిన సినిమా టికెట్ల ధరలు ..
మున్సిపల్ కార్పొరేషన్ :
నాన్ ఏసీ థియేటర్లు.. రూ. 40, రూ. 60
ఏసీ థియేటర్లు.. రూ.70, రూ.100
స్పెషల్ థియేటర్లు.. రూ.100, రూ.125
మల్టీప్లెక్స్.. రెగ్యులర్ సీట్లు రూ.150, రిక్లయినర్ సీట్లు రూ.250
మున్సిపాలిటీ:
నాన్ ఏసీ థియేటర్లు.. రూ.30, రూ.50
ఏసీ థియేటర్లు.. రూ. 60, రూ.80
స్పెషల్ థియేటర్లు.. రూ.80, రూ.100
మల్టీప్లెక్స్.. రెగ్యులర్ సీట్లు రూ.125, రిక్లయినర్ సీట్లు రూ.250
నగర/గ్రామ పంచాయతీ:
నాన్ ఏసీ థియేటర్లు.. రూ.20, రూ.40
ఏసీ థియేటర్లు.. రూ.50, రూ.70
స్పెషల్ థియేటర్లు.. రూ.70, రూ.90
మల్టీప్లెక్స్.. రెగ్యులర్ సీట్లు రూ.100, రిక్లయినర్ సీట్లు రూ.250
ఈ రేట్లకు జీఎస్టీ, మెయింటెనెన్స్, సర్వీస్ ఛార్జెస్ అదనం. ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.