ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుంది. పలు పథకాల ద్వారా జనాలకు నేరుగా ఆర్థిక సాయం అందజేస్తూ.. వారి అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్ని మాత్రం ఆపడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలోనే మహిళల ఖాతాల్లో 15 వేల రూపాయలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా పథకం లబ్ధిదారులకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పున మూడేళ్లలో 45 వేల రూపాలయ ఆర్థిక సాయాన్ని ఈబీసీ మహిళలకు అందించనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఏదో ఓ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తున్న ప్రభుత్వం.. తాజాగా అగ్రవర్ణ మహిళలను కూడా ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఈబీసీ నేస్తం పథకానికి సీఎం జగన్ అధ్యక్షతన జరరిగిన కేబినెట్ భేటీలో ఆమోదం లభించింది.
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈబీసీ నేస్తం పథకాన్నిసీఎం ఈనెల 25న ప్రారంభించనున్నారు. అగ్రవర్ణాల్లోని 45-60 మధ్య వయస్సు గల పేద మహిళలకు ఏడాదికి 15వేల చొప్పున మూడేళ్ళలో 45వేల రూపాయల నగదు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 3,92,674 మంది మహిళలకు లబ్ది చేకూరనున్నట్టు ప్రభుత్వం చెబుతుంది . దీనికోసం 589.01 కోట్లు ప్రభుత్వం కేటాయించనుంది.
ఇది కూడా చదవండి : సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం. ఇకపై బాలికలకు ఉచితంగా శానిటరీ నాప్కిన్స్!
అర్హులేవరంటే..
అగ్రవర్ణాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఈ పథకానికి అర్హులు అవుతారు. అయితే వైయస్సార్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు ఎవరూ ఈ పథకానికి అర్హుల కారు. కేవలం ఈబీసీ మహిళలు మాత్రమే లబ్ధి పొందగలరు. అయితే ఈ లబ్ధి దారులకు తప్పకుండా.. తమ పేరుతో ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ బుక్ ఉండాలి. లేదంటే అర్హులుగా పరిగణించరు.
ఆదాయం ఎంత ఉండాలంటే..
ఈబీసీ నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకునే వారి వార్షిక కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు 10 వేలు, పట్టణాల్లో నెలకు 12 వేలు పరిమితిని మించకూడదు. ఈ పథకంలో లబ్ధిదారులకు మాగాణి భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మాగాణి, మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి. కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి గాని, పెన్షనర్ గాని ఉండకూడదు. అలాగే ఈ నిబంధనలో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఇచ్చారు.
ఇది కూడా చదవండి : జగన్ భోజనానికి పిలిస్తే.. చిరంజీవి వెళ్లారు! అవి కుశల ప్రశ్నలే: మంత్రి పేర్ని నాని
వీరు అర్హులు కారు..
ఈబీసీ నేస్తం లబ్ధి పొందాలి అనుకునే మహిళల కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ ఇన్‌కమ్ టాక్స్ కడుతున్న వారు ఉండకూడదు. 2021 సెప్టెంబర్ 29వ తేదీ నాటికి 45 సంవత్సరాలు పైబడ్డ.. 60 సంవత్సరాల్లోపు ఉన్న అగ్రకుల మహిళలు ఉండాలి. జనవరి 7 వ తేదీతోనే దీనికి అప్లై చేసుకునే గడువు ముగిసింది. అయితే ఇంకా అర్హత ఉండి.. అప్లై చేసుకోకపోతే.. దగ్గరలో ఉన్న గ్రామ వార్డు, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దీంతో అర్హులైన ఈబీసీ మహిళా లబ్ధిదారులకు 15 వేల రూపాయలు అందుతాయి.