అవును..మీరు టైటిల్‌లో చదివింది నిజమే..ఇక ఇప్పటికే దేశ వ్యాప్తంగా పెట్రోల్ రేట్లు మంట పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్త మరువక ముందే మరో న్యూస్‌తో వాహనదారుల నెత్తిన మరో పిడుగు పడ్డట్లు అవుతోంది. దీంతో విపరీతంగా పెరుగుతున్న ఇంధన ధరలకు సామన్యులు గిలగిల కొట్టుకుంటున్నారు. ఎప్పుడో సెంచరీ దాటిన పెట్రలో రేట్లు అంతకంతకూ పెరుగుతూ వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
అయితే తాజాగా మరో విషయం ఏంటంటే..? ట్రాఫిక్ చలానాల జారీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ ఎనఫోర్స్‌మెంట్ పరికరాల జారీకి కేంద్రం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. స్పీడ్ కెమెరా, స్పీడ్ గన్, సీసీటీవీ, బాడీ వెరబుల్ కమెరా, డాష్‌బోర్డు కెమెరా, అటోమెటిక్ నెంబర్ ప్లెట్ రికగ్నిషన్, వెయింగ్ మిషన్లు వంటి పరికరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర రహదారి రవాణా శాఖ తెలిపింది.
ఇక ఇందులో తెలంగాణలోని హైదరాబాద్, నల్గొండ, పటాన్ చెర్, సంగారెడ్డి వంటి కేంద్రాల్లో ఈ మిషన్‌లను ఏర్పాటుకు తేనున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో సైతం 11 కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో వాహనదారుల వేగానికి బ్రేక్‌లు పడ్డట్లే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.